Ashok Gehlot: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కోవిడ్-19, స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. జ్వరం, తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలు ఉండటంతో జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అచల్ శర్మ శనివారం చెప్పారు.
రాజస్థాన్లోని అల్వార్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కోడలు చిత్రా సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర (59) కూడా కారులో ఉండగా.. ఆయనకు గాయాలయ్యాయి.
భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
Kota: రాజస్థాన్ కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కోటాలో 18 ఏళ్ల జేఈఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసింది. పరీక్షకు రెండు రోజుల ముందు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కోటాలో వారం రోజుల్లో ఇది రెండో ఆత్మహత్య.
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఫోన్ వాడొద్దని చెప్పినందుకు.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భజరంగనగర్లో చోటుచేసుకుంది. అంతకుముందు కూతురుపై కోపోద్రిక్తుడైన తండ్రి.. శాంతింపజేసేందుకు తాను వెళ్లిన గదికి వెళ్లి చూడగా.. అమ్మాయి ఉరివేసుకుని ఉండటం చూసి చలించిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోట పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇప్పటి వరకు…
రాజస్థాన్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 15 రోజుల తర్వాత ఈ మధ్యాహ్నం మంత్రులకు శాఖలను అప్పగించారు. అత్యధికులు తొలిసారిగా మంత్రులుగా పనిచేసినవారే. మంత్రులకు బాధ్యతలు అప్పగించే ముందు బీజేపీ అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడంతో పోర్ట్ఫోలియో ప్రకటనకు కొంత సమయం పట్టింది.
రాజస్థాన్లో నకిలీ పెన్షనర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో 4 లక్షల మంది పెన్షన్లు నిలిపివేసింది. సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థులు ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోలేరు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కోచింగ్ సెంటర్లు, విద్యార్థులకు కోటా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా కోచింగ్ ఏరియాలో లౌడ్ మ్యూజిక్ సిస్టమ్పై నిషేధం ఉంటుందని పోలీసులు తెలిపారు. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్లు, మెస్ల దగ్గర మద్యం, మత్తు పదార్థాలు సేవించరాదని చెప్పారు. కోటా సిటీ ఎస్పీ శరద్ చౌదరి కూడా ఈ ఉత్తర్వును కచ్చితంగా అమలు చేయాలని కోచింగ్…