కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని.. ఆ పార్టీకి రాష్ట్రంలో ఒక్కసీటు కూడా రాదని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి.
Train Accident in Ajmer: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సోమవారం (మార్చి 18) తెల్లవారుజామున సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్‌కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
అపాచీ గర్జనకు శత్రువులు వణికిపోతారు, సైన్యం బలం పెరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో అపాచీ హెలికాప్టర్ల తొలి స్క్వాడ్రన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. పశ్చిమ ప్రాంతంలో భూసేకరణ చేసేందుకు స్క్వాడ్రన్ సహకరిస్తుందని అధికారులు తెలిపారు.
CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.
పెట్రోల్ ధరలను తగ్గిస్తామని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ధరలు మాత్రం తగ్గలేదన్నారు. 33 శాతం మంది డీలర్లు మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు
Mahashivratri: రాజస్థాన్ కోటాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరుపుతున్న ఊరేగింపులో ప్రమాదం జరిగింది. ఉరేగింపు సమయంలో 14 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కి గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. గాయపడిన చిన్నారుల్ని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. కొంత మంది చిన్నారులను అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
UCO Bank : ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తునకు సంబంధించి సీబీఐ కీలక చర్య తీసుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని 67 చోట్ల సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది.
రాజస్థాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ(40) మృతి చెందారు. గత కొంతకాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్న రోహిత్ శర్మ.. జైపూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు.
Theft : జైపూర్‌లో శుక్రవారం ఓ వ్యాపారి నుంచి దుండగులు రూ.33 లక్షలు దోచుకున్నారు. ఇద్దరు అగంతకులు ఆ వ్యాపారి కళ్లలో కారం కొట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కారులో కూర్చున్న వ్యాపారి చేతిలోని బ్యాగ్‌ని ఈ దుండగులు లాక్కొని పారిపోయారు.
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.