చిరుత పులి తోక కనపడితేనే ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగులు తీస్తాం.. అలాంటిది, చిరుతపులితో పోరాటం అంటే మాటల్లో చెప్పలేం.. ఇలా చిరుత పులితో తలపడటం కొన్ని సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం.. కానీ, రాజస్థాన్ రాష్ట్రంలో ఓ జర్నలిస్ట్ చిరుతతో ఫైట్ చేశారు. అయితే, వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని దుంగార్‌పుర్ భదర్ మెట్వాల గ్రామంలోకి చిరుత పులి రావటంతో ఆ చిరుతను జనాలు తరిమికొట్టేందుకు ప్రయత్నం చేశారు.
Read Also: Garlic : మార్కెట్లో నకిలీ వెల్లుల్లి.. అక్రమ రవాణాలో చైనా హాషీష్, నల్లమందుతో పోటీ
అయితే, గ్రామస్తులు రాళ్లు రువ్వుతు చిరుత పులిని బెదిరించారు. ఇక, అక్కడే ఓ వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్ట్ గున్వంత్ కలాల్ పై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకోవడంతో అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టేసుకున్నాడు. దాని దవడ, మెడను గట్టిగా పట్టుకుని.. ఆ తర్వాత చిరుత పులిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ జర్నలిస్ట్ చిరుత పులితో ఫైట్ చేయడంపై నెటిజన్స్ వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు.