PM Modi: కాంగ్రెస్ మేనిఫేస్టోలో “ముస్లిం లీగ్” ఆలోచనలు.. దేశాన్ని విడగొట్టే యత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నిన్న ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫేస్టోపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మేనిఫేస్టో అబద్ధాల మూ అని, ప్రతీ పేజీలో భారత్‌ని ముక్కలు చేసే ప్రయత్నాలే ఉన్నాయని ప్రధాని ఆరోపించారు. శనివారం రాజస్థాన్ లోని అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన పీఏం మోడీ..‘‘ మేనిఫేస్టోలోని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు స్వాతంత్ర్యానికి ముందు నాటి ముస్లిం లీగ్ ఆలోచనలను పోలి ఉన్నాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ తన మేనిఫేస్టో రూపంలో ముసుగు విప్పిందని దుయ్యబట్టారు. కమ్యూనిస్ట్, వామపక్ష ఆలోచనలోత మేనిఫేస్టో నిండి ఉందని అన్నారు.
నేటి కాంగ్రెస్‌కి సిద్ధాంతాలు, విధానాలు లేకుండా పోయాయని ప్రధాని అన్నారు. ఆ పార్టీ అన్నింటిని బయట నుంచి తీసుకున్నట్లు తెలుస్తోందని, అటువంటి పార్టీ దేశ ప్రయోజనాల కోసం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ భారతదేశాన్ని గత శతాబ్ధంలోకి నెట్టాలని అనునకుంటోందని, కాంగ్రెస్ నారీ శక్తి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తరతరాలుగా మహిళలు నష్టపోయారని పీఎం అన్నారు. ఏప్రిల్ 19న మీ ఓటు వినియోగించుకుని కాంగ్రెస్‌ని శిక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read
Read Also: Karnataka: కాంగ్రెస్ నేత ఇంట్లోనే “పాకిస్తాన్” ఉంది.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
మరుగుదొడ్ల నిర్మాణం, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు, కుళాయి నీరు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం వంటి కార్యక్రమాలను తమ ప్రభుత్వమే చేసిందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్మీలో మహిళలకు అవకాశాలు కల్పించింది తమ ప్రభుత్వమే అని, చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకు దక్కుతుందని చెప్పారు. గ్రామాల్లో సైకిల్ తొక్కలేని మహిళలు, ఇప్పుడు డ్రోన్లు ఎగరేస్తున్నారని ప్రధాని చెప్పారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేశాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని అన్నారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో రెండు విడతల్లో-ఏప్రిల్ 19 మరియు ఏప్రిల్ 26 న ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ స్థానాలకు గానూ 2019లో బీజేపీ 24 స్థానాలను గెలుచుకుంది. 2014లో 25 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!