రాజస్థాన్‌లోని కోటాలో బాలుర హాస్టల్ భవనం ఆదర్శ్ రెసిడెన్సీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
రాజస్థాన్ లోని కోటాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘటన కలకలం రేపుతుంది. మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రిలో పని చేసే 32 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగి మృతదేహం వైద్య సదుపాయంలోని టాయిలెట్లో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని నయాపురా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వ్యక్తి మృతికి గల…
Congress: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే పలువురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
PM Modi: నిన్న ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫేస్టోపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మేనిఫేస్టో అబద్ధాల మూ అని, ప్రతీ పేజీలో భారత్‌ని ముక్కలు చేసే ప్రయత్నాలే ఉన్నాయని ప్రధాని ఆరోపించారు.
Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. శనివారం రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ పాఠశాల అమానుషంగా వ్యవహరించింది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ విద్యార్థినిని 12వ తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు.
ఓ వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్ట్ గున్వంత్ కలాల్ పై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకోవడంతో అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టేసుకున్నాడు. దాని దవడ, మెడను గట్టిగా పట్టుకుని.. ఆ తర్వాత చిరుత పులిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్‌లోని కోట్‌పుట్లీలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Love Affair: లివింగ్ రిలేషన్స్, వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. చాలుమాటు సంబంధాలు నేరాలతో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్న వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే 10 సార్లు గొంతు కోసి హతమార్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న సమయంలో మృతురాలు రక్తపుమడుగులో పడి ఉంది. పక్కనే నిందితుడు కూడా ఉన్నాడు.