లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది.
Supreme Court: చలికాలం సమీపిస్తుందంటే చాలు.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Kid Assaults: పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఓ వ్యక్తి తన కుక్కను అనుకరిస్తున్నాడన్న ఆరోపణతో ఐదేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఇందులోని ఆందోళన కలిగించే దృశ్యాలు వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. 5 ఏళ్ల బాలుడు ట్యూషన్ క్లాస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కుక్క మొరుగడాన్ని అనుకరిస్తూ కనిపించాడు. ఈ చర్య కుక్క యజమానికి కోపం తెప్పించింది. దాంతో ఆగ్రహించిన…
పంజాబ్‌లోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం వేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గురుదాస్‌పూర్‌లోని హర్దోవల్ కలాన్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం రూ. 50 లక్షలకు వేలం ప్రారంభం కాగా, స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మా సింగ్ రూ. 2 కోట్లకు వేలంలో సర్పంచ్ సీటును సొంతం చేసుకున్నాడు.
పంజాబ్‌తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు.
నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే ఫస్ట్ టైం.
Iron Rods In Rail Track: పంజాబ్‌లోని భటిండాలో ఈరోజు (సోమవారం) పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్లు కనిపించడంతో గూడ్స్ రైలు యొక్క లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
Bhagwant Mann: ఖలిస్తాన్ మద్దతుదారు, ఈ ఏడాది పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అమృత్‌పాల్, అతడి సన్నిహితుల నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలకే కాకుండా, సీఎం ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పారు. పంజాబ్ పోలీసులు వారి వాదనలకు మద్దతుగా గతంలో అమృత్‌పాల్ సింగ్ చేసిన ప్రసంగాలకు సంబంధించి వీడియో క్లిప్‌లను ప్రస్తావించారు.