Delhi Chalo: పంజాబ్ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెబర్ 6) దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్‌గా బయలు దేరుతుందని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు.
Punjab: పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగుల బెట్టారు. ఈ సీజన్‌లో పంజాబ్ లో కేసుల సంఖ్య 8,404కి చేరిపోయింది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (62) శనివారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ట్వీట్ చేశారు.
Punjab Sarpanch Oath Ceremony: ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో ప్రమాణ స్వీకారం చేసేందుకు శుక్రవారం పంజాబ్‌లోని లూథియానాలో భారీ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా రానున్నారు. కేజ్రీవాల్ రెండు రోజుల పాటు పంజాబ్‌లోనే ఉండనున్నారు. లూథియానాలో పంజాబ్ సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారోత్సవానికి కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మరుసటి రోజు నవంబర్ 9న,…
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు విధించే పెనాల్టీని రెట్టింపు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రూ.30,000 వరకు జరిమానాను విధించేలా ఆదేశాలు జారీ చేసింది.
Fire Accident: పంజాబ్ లోని లూథియానా పరిధిలోని నూర్వాలా రోడ్డు సమీపంలోని బసంత్ స్ట్రీట్ లోని రెండంతస్తుల భవనంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులోని ఓ బట్టల దుకాణం సమీపంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో కారు కూడా దగ్ధమైనట్లు అధికారి తెలిపారు. మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయని, అయితే స్టాక్ ఇంకా ఫైర్ సేఫ్టీ చర్యలపై కొంత ఉద్రిక్తత ఉందని అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ మణిందర్ సింగ్ తెలిపారు.…
ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్‌ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Pakistan: పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
Akali Dal: పంజాబ్‌లో వరస ఓటములతో ఢీలా పడిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)కి ఊరట విజయం దక్కింది. ఈ పార్టీకి చెందిన అభ్యర్థి హర్జిందర్ సింగ్ ధామీ సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SGPC) అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి తిరిగి ఎన్నికయ్యారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. షూటర్లందరినీ పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.