లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. షూటర్లందరినీ పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా ఉక్కుపాదం మోపింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు. గాయకుడు-రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2023లో దర్యాప్తు సంస్థ అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది.
READ MORE: Unstoppable Season 4: అమరావతిలో తోడు ఎవరూ లేరు.. మేం కూర్చుని మాట్లాడుకుంటే అదే పండుగ!
అయితే.. తాజాగా సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, ఎసీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ ఎవరు? అనే ప్రశ్న మొదలైంది. అయితే తాజాగా పట్టుబడిన లారెన్స్ బిష్ణోయ్ కి చెందిన షూటర్లు విచారణలో ఒక రాజకీయ పార్టీ నాయకుడి మేనల్లుడిని చంపాలని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్‌పై కాల్పులు జరిపిన ఏడుగురు ముష్కరులను అరెస్ట్ చేసిన తర్వాత స్పెషల్ సెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ రాజకీయ నాయుకుడు ఎవరు? ఆయన అల్లుడిని ఎందుకు చంపాలనుకుంటున్నారనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి.
READ MORE:Viral Video: షోరూం ముందే కాలిపోయిన ఓలా స్కూటర్..