ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్‌ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పండుగల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని ఆయా పార్టీకి ఈసీకి తెలిపాయి. స్పందించిన ఈసీ తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది.
READ MORE: Bollywood : హృతిక్ ఆఖరికి నువ్వు కూడానా.. బాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ కథలు రైటర్సే లేరా ?
కార్తీక పూర్ణిమ సందర్భంగా ఓటింగ్ తగ్గే అవకాశం..
యూపీలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీలను మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఇటీవల మెమోరాండం ఇచ్చింది. నవంబర్ 15న కార్తీక పూర్ణిమ కారణంగా కుందర్కి, మీరాపూర్, ఘజియాబాద్, ప్రయాగ్‌రాజ్‌లలో మూడు నాలుగు రోజుల ముందుగానే ప్రజలు సంబరాల్లో నిమగ్నమవుతారని పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం తేదీలను మార్చాలని కోరింది. నవంబర్ 13న కాకుండా నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ డిమాండ్ నెరవేరింది.
READ MORE: KTR Open Letter: ఎందుకు మౌనంగా ఉన్నారు?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ..