NIA Raids : పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని మోగా, అమృత్సర్, గురుదాస్‌పూర్, జలంధర్‌లో ఈ దాడులు జరిగాయి.
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదైంది.
Punjab: మతమౌఢ్యానికి ఓ వ్యక్తి బలయ్యాడు. పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి దెయ్యం వదిలిస్తానని చెబుతూ ఓ పాస్టర్, అతని 8 మంది సహచరులు సదరు వ్యక్తిని దారుణంగా కొట్టారు. అతని శరీరం నుంచి దెయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంటూ కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన పాస్టర్‌పై కేసు నమోదు చేశారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం ఉదయం ఓ ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎన్నారైపై రెండుసార్లు కాల్పులు జరిపారు. బాధితుడు 43 ఏళ్ల సుఖ్‌చైన్ సింగ్‌గా గుర్తించారు.
పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది.
పంజాబ్‌లో ఓ ఏఎస్సై యువకులపై దురుసుగా ప్రవర్తించారు. ఏఎస్సై జస్వీందర్ సింగ్ భోగ్పూర్లో ఇద్దరు యువకులపై అందరూ చూస్తుండగానే తీవ్రంగా కొట్టాడు. కాగా.. అక్కడున్న కొందరు స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్త వైరల్‌గా మారింది.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసి హెచ్చరించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన తన లేఖలో ప్రశ్నలు సంధించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను స్వర్ణం సాధించడమే కాకుండా ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
పంజాబ్‌లోని జలంధర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జండియాల మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాలిపోతున్న చితిలోకి దూకాడు. దీంతో.. అతనికి మంటలు అంటుకుని 70 శాతం కాలాయి. ఆ వ్యక్తిని జండియాలా మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ (50)గా గుర్తించారు.