ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మార్గదర్శకాల ప్రకారం పంజాబ్‌ను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు జరుగుతున్న ప్రచారంలో స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ (SSOC) అమృత్‌సర్ అంతర్-రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా మాడ్యూల్‌ను బహిర్గతం చేసింది. ఈ ఆపరేషన్‌లో విదేశీ మూలం ఉన్న ఉగ్రవాది లఖ్‌బీర్ అలియాస్ లాండాకు చెందిన ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఆరు అధునాతన .32 బోర్ పిస్టల్స్‌తో పాటు మ్యాగజైన్‌లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Assembly By Poll Result: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10వ తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఇవాళ (శనివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
పంజాబ్లోని ఫజిల్కాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య.. కోపంతో అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొద్దామని.. అత్తగారింటికి వెళ్లిన భర్తపై అత్తమామలు దాడికి పాల్పడ్డారు. అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా కాలిపోయాడు. మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేంద్ర ప్రవేశ పెట్టిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 10, 2024న.. కొన్ని రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్‌ని ప్రకటించాయి. దీంతో హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్ల సహాయంతో మూసివేసింది.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాది, ఇటీవల ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ మరోసారి ‘ఖలిస్తాన్’కి మద్దతుగా మాట్లాడారు. ఇటీవల తన తల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
Punjab: పంజాబ్‌కి చెందిన శివసేన నాయకుడిపై నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడం పొలిటికల్ వివాదంగా మారింది. సందీప్ థాపర్‌పై లూథియానలో కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
పంజాబ్లో పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో చెలరేగిపోయారు. అందరూ చూస్తుండగానే శివసేన నాయకుడిపై దాడులకు తెగబడ్డారు. చుట్టూ జనం ఉన్నా.. ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Amritpal singh: ఇవాళ ఎంపీగా ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అయిన అమృత్ పాల్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి విజయం సాధించారు
ఇంట్లో ఏం సమస్యలున్నాయో.. ఏమో తెలియదు గానీ కుటుంబ యజమాని కసాయిగా మారిపోయి ఫ్యామిలీ మెంటర్స్‌ను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.ఈ దారుణం పంజాబ్లో చోటుచేసుకుంది.