ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో రీతా సాహిబ్ గురుద్వారా నుండి తిరిగి వస్తున్న బస్సు బోల్తా పడడంతో పంజాబ్‌కు చెందిన కనీసం 25 మంది యాత్రికులు గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు.
Amit Shah: పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పంజాబ్ గురుదాస్ పూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను టార్గెట్ చేశారు. భగవంత్ మాన్ రాష్ట్రానికి సమయాన్ని కేటాయించడం లేదని, అరవింద్ కేజ్రీవాల్ దేశ పర్యటనలకు రాష్ట్రవిమానాన్ని తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నాడని ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రా..? లేక పోలే కేజ్రీవాల్ పైలెటా..? అని ప్రశ్నించారు.
Ludhiana: లూథియానాలోని ఓ క్యాష్ కంపెనీలో రూ.7 కోట్ల దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్ కంపెనీ (సీఎంఎస్) కార్యాలయంలోకి సాయుధ దొంగలు ప్రవేశించి కోట్లాది రూపాయలను ఎత్తుకెళ్లారు.
స్వర్ణ దేవాలయం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పోస్టర్లతో పాటు కత్తులు దూశారు. శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) నాయకుడు, ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భూకంపం బారిన పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది.
Visa ban: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ,…
Dog Beats Cancer: క్యాన్సర్ తో బాధపడుతున్న పోలీస్ జాగిలం, ఇప్పుడు దాన్నుంచి విముక్తి పొందింది. కాన్సర్ ని జయించి తిరిగి విధుల్లోకి చేరింది. లాబ్రాడార్ జాతికి చెందిన పోలీస్ జాగిలం పంజాబ్ పోలీస్ శాఖలో విధ్వంసక తనిఖీల్లో సహాపడుతుందని పోలీసులు తెలిపారు. సిమ్మీ అనే పేరున్న ఈ జాగిలం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
డ్రోన్లను ఉపయోగించి పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది.