ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో కెప్టెన్ శిఖర్ ధావన్, జితేశ్ శర్మ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 10 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 83 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది.
పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు అమ్మాయిలు స్వల్పంగా గాయపడ్డారు.
Gas leak : పంజాబ్‌లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానాలోని గియాస్పురా ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయాన్ని బుధవారం చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. శ్వాసకోశ సమస్యలతో మరణించిన బాదల్‌కు నివాళులు అర్పించేందుకు ప్రధాని మోదీ చండీగఢ్ చేరుకున్నారు.
అనారోగ్యంతో కన్నుమూసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26, 27 తేదీలలో భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో వారం క్రితం మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.
పంజాబ్‌లోని మోగాలో ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అకల్ తఖ్త్ మాజీ చీఫ్, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు జస్బీర్ సింగ్ రోడే అమృతపాల్ అరెస్టుకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. మోగాలోని రోదేవాల్ గురుద్వారాలో అమృతపాల్ సింగ్ లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుకున్న జస్బీర్ సింగ్ రోడే రహస్యంగా పోలీసులకు సమాచారాన్ని పంచుకున్నాడు.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మీద పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా (కెపి) ప్రావిన్షియల్ అసెంబ్లీలను రద్దు చేయమని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా తనకు సలహా ఇచ్చారని ఆయన చెప్పారు. ఆదివారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక విషయాలు చెప్పారు.
ఒక నెలపాటు సుదీర్ఘమైన వేట తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మార్చి 18న రాష్ట్రం అమృతపాల్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని, అయితే రక్తపాతాన్ని నివారించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. మార్చి 18న పంజాబ్ పోలీసులు ఖలిస్తానీ వేర్పాటువాది, అతని సహాయకులపై అణిచివేత ప్రారంభించారు.