[6:20 pm, 29/06/2023] Swathi: పైసామే పరమాత్మ అంటున్నారు జనాలు.. ఎందుకంటే ఇప్పుడు పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా డబ్బులుంటే జరుగుతున్నాయి.. అందుకే డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.. ఆఖరికి అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షాన్యంగా పొట్టన పెట్టుకుంటున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. ఫ్రెండ్ పై ఉన్న భీమా డబ్బుల కోసం ఫ్రెండ్ నే అతి దారుణంగా ఓ వ్యాపారి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన పంజాబ్ లో వెలుగు చూసింది..హతుడు భార్య తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. వ్యాపారంలో దివాలా తీసిన గురుప్రీత్.. బీమా సొమ్మును కాజేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకు తన భార్య ఖుష్‌దీప్ సింగ్‌తో పాటు సుఖ్విందర్ సింగ్ సంగ్త, జస్పాల్ సింగ్, దినేశ్ కుమార్, రాజేశ్‌కుమార్ సుఖ్‌జీత్ అనే నలుగురి సాయం తీసుకున్నాడు. స్నేహితుడ్ని చంపి తానే చనిపోయినట్టు నమ్మిస్తే తన పేరున ఉన్న రూ. 4 కోట్ల బీమా సొమ్మును సొంతం చేసుకోవచ్చునని అనుకున్నాడు..జూన్ 19న సుఖ్‌జీత్ హఠాత్తుగా మాయమయ్యాడు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ సుఖ్‌జీత్ భార్య జీవన్‌దీప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పాటియాలా రోడ్డులోని ఓ కాలువ వద్ద సుఖ్‌జీత్ మోటార్ సైకిల్, చెప్పులను గుర్తించారు.. దాంతో అతను ఆత్మ హత్య చేసుకున్నాడని అందరు అనుకున్నాడు..
అయితే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోయినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు..అంతకు ముందు రోజే నిద్రమాత్రలు కలిపి మద్యాన్ని సుఖ్‌జీత్‌తో తాగించి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లిన గురుప్రీత్.. ఆ తర్వాత అతడి దుస్తులు విప్పదీని తాను వేసుకున్నాడు. తన దుస్తులను అతడికి తొడిగాడు. అచేతనంగా ఉన్న సుఖ్‌జీత్‌ను ట్రక్కు కిందకి తోసి ఎవరూ గుర్తు పట్టకుండా నుజ్జునుజ్జు చేశాడు.. అంత కష్టపడి చేసినా పోలీసులు చాకచక్యంగా వ్యవరించి ఈ కేసును చేదించారు..