Bus Accident: ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో రీతా సాహిబ్ గురుద్వారా నుండి తిరిగి వస్తున్న బస్సు బోల్తా పడడంతో పంజాబ్‌కు చెందిన కనీసం 25 మంది యాత్రికులు గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హల్ద్వానీ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Also Read: Honor Killing: మధ్యప్రదేశ్ లో పరువు హత్య.. ఇద్దరినీ చంపి నదిలో మొసళ్లకేశారు
ఆదివారం రాత్రి 50 మంది యాత్రికులతో బస్సు పంజాబ్‌లోని రోపర్ జిల్లాకు వెళ్తుండగా ధౌన్ సమీపంలోని ఎన్‌హెచ్-9పై ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టాయని వారు తెలిపారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని హల్ద్వానీలోని జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.