మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మీద పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా (కెపి) ప్రావిన్షియల్ అసెంబ్లీలను రద్దు చేయమని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా తనకు సలహా ఇచ్చారని ఆయన చెప్పారు. ఆదివారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక విషయాలు చెప్పారు.
ఒక నెలపాటు సుదీర్ఘమైన వేట తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మార్చి 18న రాష్ట్రం అమృతపాల్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని, అయితే రక్తపాతాన్ని నివారించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. మార్చి 18న పంజాబ్ పోలీసులు ఖలిస్తానీ వేర్పాటువాది, అతని సహాయకులపై అణిచివేత ప్రారంభించారు.
Amrit Pal Singh : దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు. రెండు రోజుల క్రితమే అమృత్ పాల్ భార్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Meat Plant : పంజాబ్‌లోని డేరా బస్సీలోని ఫెడరల్ మీట్ ప్లాంట్‌లో శుక్రవారం మధ్యాహ్నం గ్రీజు ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్న నలుగురు కార్మికులు మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నలుగురు కూలీలు ఒకరి తర్వాత ఒకరు గ్రీజు ట్యాంక్‌లోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ల్యాండ్ డీల్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబర్ట్ వాద్రా సంస్థ రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు భూమిని బదలాయించడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది.
పంజాబ్ తరన్ తరణ్‌లోని గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ పార్కింగ్ స్థలంలో ఓ బాంబు కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబును బయటకు తీశారు.
ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Golden Temple: పంజాబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కారణంగా దేశవ్యాప్తంగా పంజాబ్ లోని పరిస్థితులు చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదం ఇప్పుడు చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలోకి వెళ్లేందుకు ఓ అమ్మాయికి అనుమతి ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఆమె తన ముఖంపై భారతదేశ జాతీయ పతాకాన్ని కలిగి ఉండటమే. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Punjab Road Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైసాఖీ వేడుకలకు వెళ్తున్న యాత్రికులకు విషాదాన్ని మిగిల్చింది. హోషియార్ పూర్ జిల్లాలోని ఖురల్ ఘర్ సాహిబ్ లో బైసాఖీ వేడుకలను జరుపుకోవడానికి వెళుతున్న క్రమంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పంజాబ్‌లో ఓ సైనిక శిబిరంపై కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. భటిండా మిలిటరీ స్టేషన్లో తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో కాల్పుల జరిగాయి.