Assembly By Poll Result: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10వ తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఇవాళ (శనివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎలక్షన్స్ పై దేశంలో ఆసక్తి నెలకొంది. ఈ 13 అసెంబ్లీ స్థానాల్లో తమ విజయంపై అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమి ఎంతగానో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.
Read Also: Nigeria : కూలిన రెండంతస్తుల పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థులు మృతి, 132 మందికి గాయాలు
కాగా, పశ్చిమ బెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలు మణిక్తలా, రణఘాట్ సౌత్, బాగ్దా, రాయ్‌గంజ్ లకు సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలు నేటి మధ్యాహ్నం వరకు వెలువడనున్నాయి. 2021లో మణిక్తలా మినహా మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది. అలాగే, మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా అమర్‌వాడ అసెంబ్లీ స్థానానికి జరిగిన బై పోల్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ 78. 71 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఉత్తరాఖండ్‌లోని మంగళూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో 68.24 శాతం, బద్రీనాథ్‌లో 51.43 శాతం ఓటింగ్ నమోదైంది.. ఈ స్థానాలకు సైతం ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీహార్‌లోని రూపాలి అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజక వర్గాలకు బై ఎలక్షన్స్ జరిగాయి. ఈ బైల్ పోల్ ఓట్లు లెక్కింపు ఈరోజు 8 గంటల నుంచి కొనసాగుతుంది.