Rajnath Singh: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ మంత్రి విమర్శలు చేశారు. ఫతేఘర్ సాహిబ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెజ్జా రామ్ వాల్మీకి కోసం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గురించి మాట్లాడుతూ..
Bus Accident: పంజాబ్‌లోని లూథియానా సమీపంలోని సమ్రాలా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడి చహేలా గ్రామంలో ఉదయం భక్తులతో నిండిన టూరిస్ట్ బస్సు హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.
పంజాబ్ ముక్త్‌సర్‌లోని గిద్దర్‌బాహాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. డేరా సిద్ధ్ బాబా గంగా రామ్ వార్షికోత్సవ కార్యక్రమంలో సిలిండర్ పేలడంతో ఏడుగురు సేవకులకు మంటలు అంటుకున్నాయి. కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో బటిండాకు రెఫర్ చేశారు. భటిండాకు రెఫర్ చేసిన వారిలో ముగ్గురికి 60-70 శాతం కాలిన గాయాలయ్యాయి. మరోవైపు పేలుడు శబ్ధం విని ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు.
Shiromani Akali Dal: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో శిరోమణి అకాళీదళ్ కీలక హామీలను ఇచ్చింది. పంజాబ్ జలంధర్‌లో ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విడుదల చేశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు దశల ఎన్నికలు ముగిశాయి. అదే సమయంలో అన్ని పార్టీలు రాబోయే 3 దశల ప్రచారంలో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.
Arvind Kejriwal: తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఓటేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. పంజాబ్ రాజధాని అమృత్సర్లో ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో నుంచి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన పంజాబ్‌లోని ఖాదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా విడుదల చేయాలని కోరుతూ ఇవాళ ( మే10) పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు.