పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను స్వర్ణం సాధించడమే కాకుండా ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అర్షద్ యొక్క ఈ విజయం కూడా చరిత్రాత్మకమైనది.. ఎందుకంటే అతను ఒలింపిక్ క్రీడల చరిత్రలో బంగారు పతకం సాధించిన మొదటి పాకిస్థానీ అథ్లెట్. ఇప్పుడు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ గోల్డ్ మెడల్ సాధించినందుకు అర్షద్ నదీమ్‌కు రూ.10 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
READ MORE: Manda Krishna Madiga: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తాం..
ఈ ప్రైజ్ మనీ రూ. 10 కోట్లు పాకిస్థాన్ కరెన్సీలో ఉంది. దీనిని భారత కరెన్సీగా మార్చినట్లయితే ఈ మొత్తం దాదాపు 3 కోట్ల భారతీయ రూపాయలకు సమానం. దీంతో పాటు అర్షద్ నదీమ్ గ్రామమైన ఖనేవాల్‌లో ఆయన పేరు మీద ‘స్పోర్ట్స్ సిటీ’ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు లేకపోయినా ఒలింపిక్ పతకం సాధించడంలో అర్షద్ నదీమ్ చరిత్రాత్మక ఫీట్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లో అథ్లెట్లు కావాలనుకునే వారికి సౌకర్యాలు, మంచి వనరులను అందించడానికి స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాలనుకుంటున్నట్లు అర్షద్ నదీమ్ కొంతకాలం క్రితం చెప్పాడు. వాస్తవానికి, నదీమ్ జావెలిన్ త్రోను కొనసాగించడానికి అతడి అన్నయ్య నుంచి మొదట ప్రేరణ పొందాడు. పంజాబ్ ప్రావిన్స్ ప్రతిభతో నిండి ఉందని, కానీ వనరుల కొరత కారణంగా, ఆ ప్రతిభ అణచివేయబడిందని అతని అన్నయ్య చెప్పాడు.