నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెల్లూరు జిల్లా కాల్పుల ఘటనలో నిందితుడు సురేష్ రెడ్డికి గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని సురేష్ రెడ్డి ఇంతటి దారుణానికి ఒడి గట్టడం వెనుక ఎవరిదైనా ప్రోత్సాహం..ఉందా…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు మా ప్రభుత్వం వదిలిపెట్టం అన్నారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీతో, ఆస్పత్రి అధికారులతో మాట్లాడాం. బాధితురాలికి మెరుగైన వైద్యం…
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల గురించి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి.రాజేష్ అని తెలిపారు. పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తహసీల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారులు విచారణ చేపట్టినట్లు…
విజయవాడలో మరోసారి కలకలం రేగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పుల వాళ్లు బాకీలు ఇవ్వాలని పోరు పెడుతుండటంతో ఏం చేయాలో తెలియక వెంకటేశ్వరరావు కుటుంబం విజయవాడకు వచ్చి లాడ్జీలో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి…
నెల్లూరు కోర్టులో కీలక పత్రాల చోరీ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసు వివరాలను తాజాగా నెల్లూరు ఎస్పీ విజయారావు మీడియాకు వెల్లడించారు. శాస్త్రీయంగా పరిశోధన చేసి ఈ కేసును ఛేదించామని తెలిపారు. అన్నింటికీ డిజిటల్ ఆధారాలు ఉన్నాయన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్నింటినీ రికవరీ చేశామని…
టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం మండలం కల్దేదేవకుంట సహకారసంఘం కార్యాలయంలో క్షుద్రపూజలు జరిగాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తోటి సిబ్బందిపై సహకారసంఘం సీఈవో వెంకటేశ్ చేతబడి చేయించారని సిబ్బంది ఆరోపించారు. దీంతో సీఈవో వెంకటేశ్ పై సిబ్బంది బంధువులు దాడికి పాల్పడ్డారు. Read Also: Beeda Ravichandra: మంత్రుల డ్యూటీ విపక్షాన్ని తిట్టడమేనా? దీంతో పోలీసులు…
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో 2 నెలలు విచారణ చేశాం. 100 మంది పోలీస్ ఆఫీసర్స్ తో కేసు విచారణ చేశాం అని మీడియాకు వివరించారు హైదరాబాద సీపీ సీవీ ఆనంద్. ఏ కేసుకు కాని ఖర్చు దీనికి అయింది. TA ,DA కలిపి ఈ కేసులో 58 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యింది. హ్యాకింగ్ అనేది ఆందోళన కలిగించే అంశంగా చూడాలి . RBI నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల సొమ్ము తో బ్యాంక్…
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకులో దారుణం చోటుచేసుకుంది. బ్యాంకు లాకర్ గదిలో ఓ వృద్ధుడు ఉన్నాడనే విషయాన్ని గమనించకుండా సిబ్బంది బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో సదరు వృద్ధుడు 18 గంటల పాటు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు లాకర్ పని మీద యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. లాకర్ గదిలో ఆయన ఉండగానే బ్యాంకు పనివేళలు ముగియగానే సిబ్బంది…
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. ఓ దొంగ మొబైల్ టాయ్‌లెట్‌ను చోరీ చేసిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16న సఫిల్‌గూడ చౌరస్తాలోని మొబైల్ టాయ్‌లెట్ కనిపించకపోవడంతో పారిశుధ్య కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేశారు. మొబైల్ టాయ్‌లెట్‌ను తీసుకెళ్లిన నిందితుడు దోమల్‌గూడలో నివసించే మెదక్ జిల్లా అందోల్ మండలం…
దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లినా బాలికను ఎత్తుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. భుజ్ శివారులో జరిగిన ఈ ఘటన మార్చి 16న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని సమీపంలోని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను హుస్సేన్ కాకల్…