Hyderabad: మొబైల్ టాయ్‌లెట్ చోరీ.. తుక్కుగా మార్చి రూ.45వేలకు విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. ఓ దొంగ మొబైల్ టాయ్‌లెట్‌ను చోరీ చేసిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16న సఫిల్‌గూడ చౌరస్తాలోని మొబైల్ టాయ్‌లెట్ కనిపించకపోవడంతో పారిశుధ్య కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేశారు.
మొబైల్ టాయ్‌లెట్‌ను తీసుకెళ్లిన నిందితుడు దోమల్‌గూడలో నివసించే మెదక్ జిల్లా అందోల్ మండలం అమ్మసాగరానికి చెందిన ముప్పారం జోగయ్య(36)గా పోలీసులు గుర్తించారు. అతడు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఈ పనికి పాల్పడినట్లు వెల్లడించారు. తనకు జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం ప్రకటనల విభాగంలో పని చేస్తున్న అరుణ్‌కుమార్, జైన్ కన్‌స్ట్రక్షన్స్‌లో సూపర్‌వైజర్‌గా పని చేసే భిక్షపతి సహకారం అందించారని నిందితుడు విచారణలో అంగీకరించాడు. మొబైల్ టాయ్‌లెట్‌కు వినియోగించిన ఇనుప ఫ్రేమ్‌లను తుక్కుగా మార్చి రూ.45వేలకు విక్రయించినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. కాగా నిందితుడిని రిమాండ్‌కు తరలించి మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..

తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!