పంజాబ్‌లోని జలంధర్‌లో దారుణం జరిగింది. కబడ్డీ ప్రపంచంలో ఛాంపియన్‌గా నిలిచిన అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు, ఇండియన్ స్టార్ సందీప్ నంగల్ సోమవారం దారుణహత్యకు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సందీప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఈ హత్యకు గల కారణాలపై జలంధర్ పోలీసులు విచారణ చేపట్టారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానం…
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణహత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ దుర్గం బాబు(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. దీంతో రక్తం మడుగులో ఉన్న వీఆర్ఏను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వేస్టేషన్‌లో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొందరు ప్రయాణికులపై దాడి చేసి రూ.89 లక్షల సొత్తు ఎత్తుకుపోయారు. దుర్గి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైల్వేస్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంలో చెన్నై వెళ్లేందుకు ఎస్-6 బోగీ ఆగే ప్రదేశంలో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న రైల్వే ఖాళీ స్థలం నుంచి ఆరుగురు వ్యక్తులు రైలు కోసం వేచి చూస్తున్న ముగ్గురు ప్రయాణికుల…
ఎన్నోరోజుల తరువాత ఆ అబ్బాయికి పెళ్లి భాజాలు మోగాయి. ఎన్నో ఆశలతో భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. శోభనం రోజున భార్య పల గ్లాసుతో వచ్చింది. ఇక ఇరగతీద్దాం అనుకోని రెడీ అవుతున్న వరుడుకు, వధువు షాక్ ఇచ్చింది. ఆరోగ్య,ఎం బాలేదని చెప్పడంతో వెంటనే వరుడు అర్ధం చేసుకున్నాడు. సరే తెల్లారి అత్తగారింట్లో పూజ చేసిన వధువు .. మొదటిసారి వంట చేసి కుటుంబానికి వడ్డించింది. ఇంకేముంది.. అందరు హాస్పిటల్ పాలయ్యారు. అరెరే…
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటూ భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన మధుబాబు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన సరితను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన వెంటనే సరితకు అత్తింటి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మధుబాబు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా సరిత రెండుసార్లు అడ్డుకుంది. అయినా అతడు…
సంచలనం కలిగించిన బిట్‌ఫినిక్స్ హ్యాకింగ్ కేసు కొలిక్కి వచ్చింది. 2016 బిట్‌ఫినిక్స్ హ్యాకింగ్ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. 3.6 బిలియన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్, హీథర్ మోర్గాన్ జంటను కటకటాల వెనక్కి పంపారు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారులు. 2016లో హాంకాంగ్‌కు చెందిన బిట్‌ఫినెక్స్ అనే బిట్‌కాయిన్ ఎక్స్‌ఛేంజిలో హ్యాకింగ్ జరిగింది. ఆ సమయంలో లక్షా19వేల 754 బిట్‌కాయిన్లను హ్యాకర్లు అపహరించారు.…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాలిటెక్నిక్ పేపర్ లీకేజీ ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు రెండవ నిందితుడు స్వాతి కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పరారీలో మొదటి నిందితుడు, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వున్నారు. అలాగే, మూడవ నిందితుడు లెక్చరర్ కృష్ణమోహన్ కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు వీరు దొరికితేనే కీలక విషయాలు…
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతున్న మహిళపై ఎదురింట్లో నివాసముండే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే భర్తను అడ్డుకోవాల్సిన భార్య ఆ పని చేయకుండా… ఈ పాడు పనిని వీడియో తీయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు దిలీప్ అని.. వీడియో తీసిన అతడి భార్య తులసి అని పోలీసులు వెల్లడించారు. Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ…
ఏపీ వ్యాప్తంగా సంచలనం కలిగించింది ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ళ దారుణ హత్యకేసు. టంగుటూరు తల్లీకూతుళ్ళ డబుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు.హత్యకేసులో నిందితులను గుర్తించారు పోలీసులు. డిసెంబర్ 3న టంగుటూరులో దారుణ హత్యకు గురయ్యారు తల్లీకూతుళ్లు శ్రీదేవి, శ్రీలేఖ. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. నిందితులు కందుకూరుకు చెందిన పాత నేరస్తులు శివకోటయ్య, కిషోర్ గా గుర్తించారు పోలీసులు. నిందితులు హత్యకు నాలుగు రోజులు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఒంటరిగా ఉన్న తల్లీకూతుళ్ళను…
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో పాపులర్ డైలాగ్ మీకు గుర్తుందా? మొక్కే కదా పీకితే పీకకోస్తా అంటాడు చిరంజీవి. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో తాజాగా చోటుచేసుకుంది. తన పొలంలోని మొక్కను పీకినందుకు 7 ఏళ్ల బాలుడిని 12 ఏళ్ల బాలుడు చంపేశాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా షేక్‌పూర్ గ్రామంలో జనవరి 26న 12 ఏళ్ల బాలుడు తన పొలాన్ని పర్యవేక్షిస్తుండగా అదే గ్రామానికి…