తెలంగాణలో తెలుగు అకాడమీ కేసు తరహాలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీగా ఫిక్సుడ్ డిపాజిట్ నిధులు మాయం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖకు చెందిన రూ.4 కోట్ల నిధులు గల్లంతు అయ్యాయని తెలుస్తోంది. తప్పుడు ఎఫ్‌డీ పత్రాలు చూపించి కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచి ఫిక్సుడ్ డిపాజిట్ నిధులను కొల్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. గిడ్డంగుల శాఖ అధికారుల ఫిర్యాదుతో ఈ స్కాంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది…
శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిని హత్య చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం రాత్రి మరురానగర్‌లోని సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. Read Also: గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు…
సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఫైర్ సిబ్బంది నుంచి ప్రమాదంపై పలు వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. క్లబ్‌కు సంబంధించిన 50 వేల చదరపు అడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్‌తో పాటు విలువైన మద్యం, నగేసిలు, ప్రాచీన అరుదైన ఫర్నీచర్ కాల్‌నైట్ బార్ బంగ్లా కిచెన్,…
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్ బస్టాప్ వద్ద బిద్యాధర్ (32) అనే వ్యక్తి ఏడాది నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10:30 గంటలకు బిద్యాధర్ వద్దకు వెళ్లిన యాసిన్ తనకు ఫాస్ట్ ఫుడ్ కావాలని అడిగాడు. రాత్రి అయినందున తాను షాపును మూసివేస్తున్నానని.. ఫాస్ట్ ఫుడ్ లేదని బిద్యాధర్ చెప్పాడు.…
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఘాజీపూర్ పూల మార్కెట్‌లో బాంబు ఉందని పోలీసులకు సమాచారం రావడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి మార్కెట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఐఈడీ పేలుడు పదార్థాలతో కూడిన ఓ బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు, ఎన్ఎస్‌జీ అధికారులకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. Read Also: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి పోలీసులు ఇచ్చిన…
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ 1 సమీపంలో గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో జగన్మోహన్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ బైక్‌ను ఢీకొన్న తర్వాత 20 మీటర్ల పాటు మృతదేహాన్ని టిప్పర్ ఈడ్చుకుని వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. Read Also: పాలడుగు గ్యాంగ్ రేప్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు కాగా…
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శామీర్‌పేట మండలం పొన్నాల చెరువులో ఆదివారం ఉదయం ఓ యువతి మృతదేహం లభ్యమైంది. అయితే ఆ యువతి చేతులు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేసి యువతిని హత్య చేసి ఉంటారని.. అనంతరం బాడీని చెరువులో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు ఘటనా స్థలానికి వచ్చి యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక…
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి సూసైడ్ వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఆరోపణలు రావడం… అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీలో తాజాగా మరో కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ వన్‌టౌన్‌లోని కన్యకాపరమేశ్వరి సత్రంలో విషం తాగి…
తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్ నరేంద్ర, లడ్డూ కౌంటర్ ఉద్యోగి అరుణ్ రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు మధ్యప్రదశ్‌కు చెందిన ముగ్గురు భక్తులకు నకిలీ దర్శన టిక్కెట్లు విక్రయించారు. మూడు రూ.300 దర్శనం టిక్కెట్లను రూ.21వేలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. Read Also: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు…
తన హత్యకు రెక్కీ జరుగుతోందని ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని వంగవీటి రాధా కార్యాలయం ముందు గత కొన్నిరోజులుగా పార్క్ చేసిన స్కూటర్ అనుమానాస్పదంగా మారడంతో రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్క్ చేసిన స్కూటర్ ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: బీమా కంపెనీల ఆఫర్… పెళ్లి క్యాన్సిల్…