టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం మండలం కల్దేదేవకుంట సహకారసంఘం కార్యాలయంలో క్షుద్రపూజలు జరిగాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తోటి సిబ్బందిపై సహకారసంఘం సీఈవో వెంకటేశ్ చేతబడి చేయించారని సిబ్బంది ఆరోపించారు. దీంతో సీఈవో వెంకటేశ్ పై సిబ్బంది బంధువులు దాడికి పాల్పడ్డారు.
Read Also: Beeda Ravichandra: మంత్రుల డ్యూటీ విపక్షాన్ని తిట్టడమేనా?
దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సీఈవో వెంకటేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా సిబ్బంది నాకుసహకరిచకుండా విధుల్లో ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నోసార్లు పైఆధికారులకు ఫిర్యాదుచేశానని అందువల్ల నాపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను ఎవరి మీద చేతబడి చేయించలేదన్నారు. మూఢ నమ్మకాలను నమ్మరాదని పోలీసులు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదుచేయాలని మంత్రాలయం ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు సూచించారు.