LIVE: మహేష్ బ్యాంక్ హ్యాకింగ్.. సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో 2 నెలలు విచారణ చేశాం. 100 మంది పోలీస్ ఆఫీసర్స్ తో కేసు విచారణ చేశాం అని మీడియాకు వివరించారు హైదరాబాద సీపీ సీవీ ఆనంద్. ఏ కేసుకు కాని ఖర్చు దీనికి అయింది. TA ,DA కలిపి ఈ కేసులో 58 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యింది. హ్యాకింగ్ అనేది ఆందోళన కలిగించే అంశంగా చూడాలి . RBI నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ప్రజల సొమ్ము తో బ్యాంక్ లను నడుపుతున్న కూడా నిబంధనలు పాటించక పోవడం , నిర్లక్ష్యం చేయడం తోనే ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రధాన హ్యాకర్ దేశంలో లేడు.. ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు సీపీ. 24 మంది హ్యాకర్ లను అరెస్ట్ చేశాము. స్టీఫెన్ ఒర్జీ సెకెండ్ లెవల్ హ్యాకర్ ను అరెస్ట్ చేశాం. ఐపీ అడ్రెస్ లతో ఉన్న ప్రధాన హ్యాకర్ ను అరెస్ట్ చేయాలి. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి నిందితుడిని పట్టుకొస్తాం. ఢిల్లీ లో ఉన్న ఇంట్రా సాఫ్ట్ అనే కంపెనీ బ్యాంక్ లకు సాఫ్ట్ వేర్ ఇస్తున్నారు. చాలా బ్యాంక్ లకు వీరు సాఫ్ట్ వేర్ అందజేస్తున్నారు, కానీ సరైన సైబర్ సెక్యూరిటీ లేకుండా అందిస్తున్నారు. ఈ కేసులో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అనేది నోటీసులు ఇచ్చి విచారణ చేస్తాం
Also Read
నవంబర్ నెలలో మహేష్ బ్యాంక్ 200 మంది ఉద్యోగులకు ఫిషింగ్ మెయిల్స్ హ్యాకర్ పంపాడు.ఇద్దరు ఉద్యోగులు మెయిల్ ఓపెన్ చేయగానే..హ్యాకింగ్ కు సులువు అయింది. మహేష్ బ్యాంక్ సింగిల్ నెట్వర్క్ తో నడిపిస్తున్నారు. బ్యాంక్ వ్యవస్థలో ఒకే నెట్వర్క్ వాడకూడదు.బ్యాంకింగ్ వ్యవస్థకు ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోవాలి..కానీ మహేష్ బ్యాంక్ అలాంటిది ఏమి లేదు.
మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల హ్యాకింగ్ చేయడం సులువు అయింది. 7గురు ఖాతాదారులను సంప్రదించి 10శాతం కమిషన్ కు నగదు బదిలీలు జరిగాయి. 7 అకౌంట్స్..115 అకౌంట్స్…అక్కడి నుంచి 3వందల ఖాతాలు తెరిపించారు.ఫిషింగ్ మెయిల్స్ స్విట్జర్లాండ్- వేరే వేరే దేశాల్లో చూపిస్తున్నాయి.ఐపి అడ్రస్ లు కెనడా నుంచి పాట్నా- పాట్నా నుంచి యూకే అని ఫేక్ అడ్రస్ లు ఇచ్చారన్నారు సీవీ ఆనంద్.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?