తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు మా ప్రభుత్వం వదిలిపెట్టం అన్నారు.
పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీతో, ఆస్పత్రి అధికారులతో మాట్లాడాం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని రేపల్లె ఆస్పత్రి అధికారులను ఆదేశించాం అన్నారు మంత్రి రజిని. ప్రస్తుతం బాధితురాలు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి విడదల రజిని.
ఇదిలా వుంటే రేపల్లె రైల్వేస్టేషన్ లో వివాహితపై గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముగ్గురు యువకులు రేపల్లె నేతాజీ నగర్ కు చెందినవారు. రైల్వేస్టేషన్ సమీపంలోనే నేతాజీ నగర్ వుందని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో వివాహిత భర్తపై దాడికి దిగారు ముగ్గురు యువకులు.ఇద్దరు యువకులు వివాహితపై అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
Anagani Satyaprasad: ప్రచార ఆర్భాటమే.. మహిళలకు రక్షణేది?