Tenth Paper Leak: నంద్యాల జిల్లా పేపర్ లీక్ వ్యవహారంలో 12 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల గురించి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి.రాజేష్ అని తెలిపారు. పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తహసీల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
పరీక్ష ప్రారంభమైన తర్వాత రాజేష్ తన మొబైల్‌తో ఫోటోలు తీసి సమాధానాల కోసం బయట వేచి ఉన్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేశాడని.. మాల్ ప్రాక్టీస్ చేసిన రాజేష్‌తో పాటు 11 మంది టీచర్లను కూడా అరెస్ట్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. వీరిలో తెలుగు టీచర్లు నీలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీ దుర్గ, ఆర్యభట్టు, పోతునూరు, రంగనాయకులు ఉన్నారన్నారు. పరీక్ష కేంద్రంలో ఇలాంటి సంఘటన జరుగుతున్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్టుమెంటల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురిని సస్పెండ్ చేసినట్లు వివరించారు. కాగా అరెస్ట్ చేసిన వారిని గురువారం ఉదయం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
Also Read
AP Tenth Paper Leak: నంద్యాలలోనూ పేపర్ లీక్ కలకలం.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!