జూబ్లీహిల్స్ అమ్మాయి అత్యాచారం కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నిందితులను విచారిస్తున్నారు. గురువారం కేసులో కీలకంగా ఉన్న మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు విచారించారు. దాదాపుగా 5 గంటలు పాటు విచారణ కొనసాగింది. ఫోన్ సీడీఆర్ డేటా, సీసీ కెమెరా ఫులేజ్ ను ముందుపెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాదుద్దీన్ మాలిక్ కు మైనర్లతో ఉన్న పరిచయాలు, సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులే కాకుండా ఇతర వ్యక్తుల…
వరుస దొంగతనాలు జనం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు…తాళం వేసి ఎటైనా బయటకు వెళ్లారా? అంతే సంగతులు. ఆ ఇంటికి కన్నం వేసేస్తున్నారు.వారం రోజుల్లో ఆరు చోట్ల వరుస దొంగతనాలు జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం… బొగ్గు గనులతో విరాజిల్లుతోంది. ఎక్కువగా సింగరేణి, జెన్కో కార్మికులే ఎక్కువ. వాణిజ్య,వ్యాపార పరంగానూ అభివృద్ది చెందుతోంది.జిల్లా కేంద్రంగా మారడంతో భూపాలపల్లిలో జిల్లా ఎస్పీ నుంచి అనేక…
మగాళ్ళు మృగాళ్ళుగా మారుతున్నారు. చెన్నైలో రెండురోజుల క్రితం భార్య పిల్లల్ని రంపంతో కోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దారుణ ఘటన నుంచి తేరుకోకముందే మరో ఘటన విభ్రాంతిని కలిగించింది. తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన ఘాతుకం సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యను దారుణంగా కొట్టి చంపి చెరువులో పడేశాడు. ఇదేం లేటెస్ట్ కాదు. ఈ ఘటన జరిగి చాలా కాలం అయింది. ఐదు నెలల తరువాత…
శ్రీకాళహస్తిలోని పిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్‌లో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను బెదిరించి వాళ్లను బంధించారు. అనంతరం వాళ్ల దగ్గర లాకర్ రూమ్ తాళాలు తీసుకుని రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.…
దొంగల్లో పలు రకాలు ఉంటారు. ఒకరు డబ్బులు దొంగతనం చేస్తే.. మరొకరు నగలు చోరీ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బట్టల దుకాణంలో బట్టలు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రిలయన్స్ ట్రెండ్స్‌లో మంగళవారం నాడు చోరీ జరిగింది. బట్టలు దొంగతనం చేస్తూ ఓ వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. దీంతో రిలయన్స్ విజిలెన్స్ విభాగం అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తి మక్కువ…
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రదేశంలో పోలీసులు అనంతబాబును విచారించారు. విచారణలో భాగంగా ఆయనకు కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కాకినాడ జిల్లా కోర్టుకు వేసవి సెలవులు కావడంతో స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి చల్లా జానకి ముందు అనంత…
ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ దొరికిన అంశం హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే చట్టం ముందు అందరూ సమానులేనని.. తప్పు చేసింది ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైసీపీ మంత్రులు క్లారిటీ ఇస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన…
ఏపీలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం రేపుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి రాష్ట్ర పోలీసు వ్యవస్థ బయటపడాలి. ప్రశ్నించే గొంతులను ఎందుకు నొక్కుతున్నారు? దళితుల హత్య అంటే తేలిగ్గా తీసుకోవద్దని డీజీపీకి తెలుపుతున్నాను. తూర్పు గోదావరి నుంచి సుబ్రహ్మణ్యం అనే మరో దళితుడు ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో బలైపోయాడు. సుబ్రమణ్యం మరణానికి అసలు కారణాన్ని అన్వేషించాలి. ఎమ్మెల్సీ అనంత బాబు…
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో ఘోరం జరిగింది. హోటల్ సిబ్బంది రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. మహ్మద్ హుస్సేన్ అనే బాలుడిని కర్రలతో దాడి చేశారు. హోటల్ సిబ్బంది దాడి లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు అనంతరం ఆస్పత్రిలో మరణించాడు. దాడిలో గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ ని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహ్మద్ హుస్సేన్ మృతి చెందాడు. మహ్మద్ హుస్సేన్ తమ్ముడిపై గంజి పోశారు హోటల్ లో పని చేసే సిబ్బంది. తమ్ముడి పై…