Hyderabad: బ్యాంక్ సిబ్బంది నిర్వాకం.. లాకర్ గదిలోనే 18 గంటల పాటు వృద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకులో దారుణం చోటుచేసుకుంది. బ్యాంకు లాకర్ గదిలో ఓ వృద్ధుడు ఉన్నాడనే విషయాన్ని గమనించకుండా సిబ్బంది బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో సదరు వృద్ధుడు 18 గంటల పాటు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు లాకర్ పని మీద యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. లాకర్ గదిలో ఆయన ఉండగానే బ్యాంకు పనివేళలు ముగియగానే సిబ్బంది గమనించకుండా బయటి నుంచి లాకర్ గది మూసి తాళం పెట్టారు. అయితే వృద్ధుడి వద్ద సెల్‌ఫోన్ కూడా లేదు.
ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు చూడగా, కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయినట్లు గుర్తించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. కృష్ణారెడ్డి మధుమేహం, బీపీతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!