కేంద్రంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు బుధవారం నోటీసులు ఇవ్వగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. 2019లో అలాంటి తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయసభలు మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో రెండు సభలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.