PM Modi Sharad Pawar Ajit Pawar Share Stage Days After INDIA alliance: ప్రతిపక్ష కూటమిలో సీనియర్ నాయకుల్లో ఒకరైన శరద్ పవార్ ఈరోజు మహారాష్ట్రంలో జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు. పూణేలోని లోక్‌మాన్య తిలక్ స్మారక మందిర్ వారు మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరద్ పవార్ హాజరయ్యారు. ఇదే వేదికపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సీపీని చీల్చి బిజెపితో చేతులు కలిపిన శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పవార్ మాట్లాడుతూ.. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం తీసుకురావాలని లోకమాన్య తిలక్ కోరుకున్నారన్నారు. అయితే.. బ్రిటీష్ నుంచి స్వాతంత్రం పొందాలంటే, ప్రజల్ని ఏకం చేయాలని ఆయన గ్రహించారన్నారు. అప్పుడు ఆయన జర్నలిస్ట్‌గా మారి.. కేసరి, మరాఠా వారాపత్రికల్ని లాంచ్ చేశారన్నారు. బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాడారన్నారు. జర్నలిజంపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండకూడదని తిలక్ చెబుతుండేవారని పవార్ గుర్తు చేశారు.
Yadadri: ఆన్‌లైన్‌లో యాదాద్రి ఆర్జిత పూజా టికెట్లు.. బుకింగ్ టైంలో ఇవి తప్పనిసరి
మరోవైపు.. వచ్చే ఏడాది జాతీయ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదురించడమే లక్ష్యంగా 26 పార్టీలు కలిసి ‘INDIA’ కూటమిని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ప్రధాని మోడీతో శరద్ పవార్ వేదికని పంచుకోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా.. శివసేన పార్టీ పవార్ ఈ ఈవెంట్‌కి వెళ్లకుండా ఉండాల్సిందని సూచించింది. శివసేనకు చెందిన ‘సామ్నా’ అనే సంపాదకీయం.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అవినీతికి పాల్పడిందని, అనంతరం పార్టీలో చీలికకు శ్రీకారం చుట్టి మహారాష్ట్ర రాజకీయాలపై బురద జల్లే ప్రయత్నం చేసిందని మోడీ ఆరోపించారని పేర్కొంది. అటు.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని, అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదేనని నిలదీశారు. మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే, ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tobacco Price: పాన్ మసాలా, పొగాకు ఎగుమతిదారులకు షాక్.. రీ ఫండ్‌కు నో ఛాన్స్