వరంగల్‌లో సీఎం కేసీఆర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన విమర్శలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ప్రధాని హోదాలో మోడీ అన్ని అబద్దాలే మాట్లాడారు అని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ పెద్ద దద్దమ్మ.. రాహుల్, మోడీ ఇద్దరూ దొంగలే.. దేశం నాశనానికి వీరే కారకులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూలై 7న ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మరుసటి రోజు తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించి దాదాపు రూ.50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు చేయనున్నారు.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఆయన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని అన్నారు.