Viral Video: అవిశ్వాస తీర్మానాన్ని ఆనాడే ఊహించిన మోడీ.. 2019 నాటి వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi predicted no-trust motion in 2023 in 2019 speech, Video Goes Viral: కేంద్రంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు బుధవారం నోటీసులు ఇవ్వగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. 2019లో అలాంటి తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ దీని గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘2023లో మళ్లీ అవిశ్వాసం పెట్టే అవకాశం వచ్చేలా మీరు ఎంతగానో సిద్ధం కావాలని నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను’’ అని మోడీ అనడంతో అధికార పక్ష సభ్యులు నవ్వులు చిందించారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఎద్దేవా చేస్తూ నాడు మోదీ ఇలా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
Also Read: No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఆమోదించిన లోక్‌సభ స్పీకర్
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మోడీ ప్రసంగంలోని ఈ భాగాన్ని ఆయన “అంచనా” హైలైట్ చేయడానికి పంచుకున్నారు. అహంకారం వల్ల 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ సంఖ్య ఒకేసారి 400 నుండి దాదాపు 40కి పడిపోయిందని ప్రధాని మోడీ ఆ సమయంలో అన్నారు. అహంకారం వల్ల జరిగిన పరిణామం అది అని ఆయన పేర్కొన్నారు. సేవాభావం వల్లే బీజేపీ రెండు స్థానాల నుంచి ఒంటరిగా అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగిందని మోడీ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
తాజాగా మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్ ఇప్పుడు చర్చ తేదీని త్వరలో ప్రకటిస్తారు. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక నోటీసును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఫ్లోర్ లీడర్ నాగేశ్వర్ రావు స్పీకర్‌కు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఉన్న సంగతి తెలిసిందే.
VIDEO: PM Sh @narendramodi had made a prediction 5 years back about the opposition bringing a No confidence motion! pic.twitter.com/dz8McicQ40
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 26, 2023
తాజావార్తలు
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
ట్రెండింగ్
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!