Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari About PM Modi Mann Ki Baat Program: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడి పెట్టొద్దని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్‌లో సామాజిక అంశాలు, మంచి పనులు ఉంటాయని తెలిపారు. ఏపీ బీజేపీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించింది. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న మంచి పనులు తెలిసేలా చేసేదే ఈ మన్ కీ బాత్ అని అన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 30 కోట్ల చెట్లను నాటడానికి అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చిందని మోడీ చెప్పారన్నారు. 2500 సంవత్సరాల పురాతన విగ్రహాలను అమెరికా నుంచి తిరిగి తెస్తున్నామని మోడీ తెలిపారన్నారు. మధ్యప్రదేశ్‌లోని విచార్‌పూర్ అనే గ్రామాన్ని మినీ బ్రెజిల్‌గా పేర్కొంటారని, అక్కడి పిల్లల్లో ఫుట్‌బాల్ క్రీడకి కావాల్సిన నైపుణ్యం వారి జీన్స్‌లోనే ఉందని కొనియాడారు. విచార్‌పూర్ ఒక చిన్న ఆదివాసీ గ్రామమని చెప్పారు. మన్ కీ బాత్ ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయిందని చెప్పుకొచ్చారు.
Women Fight in Bus Video: బస్సులో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు.. ఓర్నీ..
Also Read
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
కాగా.. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోడీ మొదట హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం 11:30 నుంచి తెలుగులో మాట్లాడారు. దేశంలో డ్రగ్స్, మత్తు పదార్ధాలు లేకుండా చేయడం.. యువతను వాటి నుంచి దూరం చేయడంపై ప్రధాని ప్రసంగించారు. 75 సంవత్సరాల స్వతంత్రం వేడుకల సమయంలో యువత ప్రాధాన్యత గురించి మోడీ చెప్పారు. పలు దేశాల్లో ఉండిపోయిన భారత కళాకృతులను వెనక్కు తీసుకొచ్చామన్నారు. అలాగే.. తిరుపతిలో భక్తులు, యాత్రికుల కోసం ప్రసాద్ స్కీంను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
TFCC Elections: సంతోషపడాలో, సిగ్గుపడాలో తెలియట్లేదు.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై తమ్మారెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!