3.2K డిస్ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- కొత్త టాబ్లెట్ Xiaomi Pad 8 ను అధికారికంగా లాంచ్
- 11.2 అంగుళాల 3.2K LCD డిస్‌ప్లే, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
- 11.2 అంగుళాల 3.2K LCD డిస్‌ప్లే, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
- ఆడియో విభాగంలో క్వాడ్ స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Pad 8 Launch: షియోమీ (Xiaomi) భారత్ లో కొత్త టాబ్లెట్ షియోమీ ప్యాడ్ 8 (Xiaomi Pad 8)ను అధికారికంగా లాంచ్ చేసింది. బుధవారం విడుదల కానున్న షియోమీ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు ముందే ఈ టాబ్లెట్ ను లాంచ్ చేసింది. ఇందులో 11.2 అంగుళాల 3.2K LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 3:2 ఆస్పెక్ట్ రేషియో, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, TÜV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది.
అదే నానో టెక్చర్ డిస్ప్లే వర్షన్ లో AG నానో టెక్స్చర్ + AR కోటింగ్ ను ఉపయోగించడంతో స్క్రీన్ రిఫ్లెక్టివిటీని సుమారు 70% వరకు తగ్గించగలదు. ఈ టాబ్లెట్ ఫుల్ మెటల్ యూనిబాడీ డిజైన్ తో కేవలం 5.75mm మందంతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ పై పనిచేస్తూ గరిష్టంగా 12GB ర్యామ్ వరకు అందుబాటులో ఉంటుంది. ఆడియో విభాగంలో క్వాడ్ స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉన్నాయి. ఇందులో 9200mAh బ్యాటరీను అందించారు. ఇది 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ టాబ్లెట్‌తో 9.3 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ పొందవచ్చు. కెమెరా విభాగంలో 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
Also Read
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- 7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
- 6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..
ఈ టాబ్లెట్ Xiaomi HyperOS 3పై పనిచేస్తుంది. ఇందులో అప్‌డేట్ చేసిన లాక్ స్క్రీన్లు, వాల్‌పేపర్లు, విడ్జెట్లు అందించారు. అలాగే ప్రొఫెషనల్, రోజువారీ వినియోగానికి అనుకూలంగా అనేక సాఫ్ట్‌వేర్ ఫీచర్లను జోడించారు. ఈ టాబ్లెట్ టైటానియం బ్లూ, గ్రాఫిక్ గ్రెయ్ రంగుల్లో లభిస్తుంది. మార్చి 17 నుంచి అమెజాన్, mi.com, షియోమీ రిటైల్ స్టోర్లలో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలకు అందుబాటులోకి రానుంది.
షియోమీ ప్యాడ్ 8 ఫీచర్లు:
మల్టీటాస్కింగ్: 5:5 వర్టికల్ స్ప్లిట్ వ్యూ మరియు 1:9 హారిజాంటల్ స్ప్లిట్ రేషియోతో విండో మేనేజ్‌మెంట్.
వర్క్‌స్టేషన్ మోడ్: త్వరగా యాప్‌లను యాక్సెస్ చేయడానికి అప్‌గ్రేడ్ చేసిన డాక్.
PC-లెవల్ బ్రౌజర్: మౌస్ హోవర్ ప్రీవ్యూ, రైట్ క్లిక్ ఫంక్షన్, కొత్త టూల్‌బార్.
WPS ఆఫీస్ PC: WPS డాక్స్, స్లైడ్స్, షీట్స్, PDFs సృష్టించడానికి, ఎడిట్ చేయడానికి OSలోనే ఇన్‌టిగ్రేషన్
AI ఇంటిగ్రేషన్: Xiaomi HyperAI ద్వారా డివైస్‌ల మధ్య కనెక్టివిటీ, టాస్క్ ట్రాన్సిషన్స్ సపోర్ట్.
ఇందుకు ప్రత్యేకంగా “ఫోకస్ పెన్ ప్రో” స్టైలస్ అందుబాటులో ఉంది. ఇది 17.5 గ్రాముల బరువుతో ప్రెషర్ సెన్సిటివ్ కంట్రోల్, పించ్ మరియు డబుల్ ట్యాప్ జెష్చర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఫోకస్ కీబోర్డ్, స్టాండర్డ్ కీబోర్డ్ కూడా అందుబాటులో ఉన్నాయి.
LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం
Xiaomi Pad 8 స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 11.2 అంగుళాల LCD, 3200×2136 రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10, డాల్బీ విజన్.
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4, Adreno GPU
ర్యామ్ & స్టోరేజ్: 8GB / 12GB RAM, 128GB / 256GB స్టోరేజ్
సాఫ్ట్‌వేర్: HyperOS 3 (Android 16 ఆధారితం)
కెమెరాలు: 13MP రియర్, 8MP ఫ్రంట్
ఆడియో: 4 స్పీకర్లు, Dolby Atmos, Hi-Res ఆడియో
కనెక్టివిటీ: Wi-Fi 7, Bluetooth 5.4, USB-C 3.2 Gen1
బ్యాటరీ: 9200mAh, 45W ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్

ధర:
* షియోమీ ప్యాడ్ 8 (8GB + 128GB) – రూ.33,999
* షియోమీ ప్యాడ్ 8 (12GB + 256GB) – రూ.36,999
* షియోమీ ప్యాడ్ 8 (12GB + 256GB Nano Texture Display) – రూ.38,999
యాక్సెసరీస్ ధరలు:
* షియోమీ ఫోకస్ పెన్ ప్రో – రూ.5,999
* షియోమీ ప్యాడ్ 8 కీబోర్డ్ – రూ.4,999
* షియోమీ ప్యాడ్ 8 ఫోకస్ కీబోర్డ్ – రూ.8,999
రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!
లాంచ్ ఆఫర్లు:
* SBI క్రెడిట్ కార్డులతో రూ.3000 వరకు డిస్కౌంట్
* 9 నెలల వరకు నో-కాస్ట్ EMI
* షియోమీ ఫోకస్ పెన్ ప్రో కొనుగోలుపై రూ.1000 తగ్గింపు (Creator’s Editionతో)
* Pad 8 + Focus Pen Pro + Keyboard కలిపి కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు
* మార్చి 31లోపు కొనుగోలు చేస్తే 1 సంవత్సరం అదనపు వారంటీ.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!