CM Jagan Interesting Comments: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో పర్యటిస్తున్న సీఎం జగన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఆరు, ఏడు నెలల్లోనే పరిహారం అందేలా చూస్తామన్నారు. మాతో సంబంధం లేకుండా.. నేరుగా కేంద్రం నుండి నిర్వాసితుల అకౌంట్లలో డబ్బులు వేయాలని కోరామన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబులాగా అన్ని మాకిచ్చేయండి చేసేస్తామని చెప్పడం లేదన్నారు. ప్రాజెక్టుకు డబ్బులిస్తే చాలు, నిర్వాసితులకు అవసరం లేదని చంద్రబాబులా చెప్పమని అన్నారు.
Rahul Gandhi: 137 రోజుల తర్వాత పార్లమెంటుకు రాహుల్ గాంధీ.. లభించిన ఘనస్వాగతం
ఈ నెలాఖరులోగా కేంద్ర క్యాబినెట్ పోలవరం మొదటి దశ పరిహారానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సీఎం జగన్ తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించే బటన్ ప్రధాని మోడీ నొక్కినా పర్వాలేదన్నారు. ఎన్నికల్లోపే.. అంటే వచ్చే ఆరేడు నెలల్లోనే పోలవరం మొదటి దశ పరిహారం పూర్తవుతుందన్నారు. మరో 48 ఆవాసాలను మొదటి దశ పరిహారంలో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించామన్నారు. 41.15 మీటర్లకు మొదటి దశ పోలవరం పూర్తవుతుందన్నారు. పోలవరం డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం మూడు దశల్లో నీళ్లు నింపాలన్నారు. కేంద్రం ఇచ్చే 6.8 లక్షలకు, రాష్ట్రం వాటా 3.2 లక్షలు కూడా కలిపి ఇస్తామన్నారు. పోలవరం రెండు, మూడు దశల్లో కూడా ఇదే రకంగా పరిహారం పూర్తి చేస్తామన్నారు. పోలవరం పరిహారం కోసం తాను గట్టిగా కృషి చేస్తున్నానని, గత ప్రభుత్వాలు లాగా అన్ని తానే చేయాలని అనుకోవడం లేదని కౌంటర్లు వేశారు.
2013 రెట్లకు పోలవరం పరిహారం ఇవ్వాలని చంద్రబాబు బుద్ధి లేకుండా సంతకం పెట్టారని సీఎం జగన్ విమర్శించారు. పోలవరం విషయాలన్నీ తాను చెప్పినట్టు కచ్చితంగా జరుగుతాయన్నారు. వరదల వల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలకు కూడా రూ.2 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. కటాఫ్ అయిన ఇళ్లకు కూడా రేషన్ అందిస్తామన్నారు. ఇప్పటికే బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, కూరగాయలు అందిస్తున్నామని తెలిపారు. ఇల్లు దెబ్బతిన్నవారికి రూ.10 వేల ఆర్థియ సహాయం చేస్తామన్నారు. గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ఉంచుతామని పేర్కొన్నారు.