Undavalli Arun Kumar Sensatioal Comments On Central And AP State Governments: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని.. ఇంకా పునాదుల్లోనే ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తీర్మానం జరిగి ఇవాల్టికి పదేళ్లయిందని అన్నారు. ఉమ్మడి రాజధాని, పోలవరం నేషనల్ ప్రాజెక్టును తీర్మానంలో ప్రస్తావించి.. రాష్ట్ర విభజన చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదు నుండి ఒక్క ఏడాదిలోనే బయటకు వచ్చామని చెప్పారు. దుగరాజపట్నం పోర్టు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు కనీసం ప్రారంభించలేదని మండిపడ్డారు. రైల్వే జోన్ ఇస్తామని చెప్పి, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు మోడీకి అనుకూలంగా ఉన్నాయని ఉండవల్లి పేర్కొన్నారు. కేంద్ర ఏం చేసినా.. గట్టిగా ఎదుర్కొనే పరిస్థితిలో అధికార, ప్రతిపక్షాలు లేవని తేల్చి చెప్పారు. ఒక్క శాతం ఓట్లు లేకపోయినా.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉందన్నారు. వైసీపీ, టీడీపీ బలం కూడా కేంద్రానికే ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని.. అసలు అవిశ్వాస తీర్మానాన్ని గట్టిగా ఎక్స్‌పోజ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయాలని అన్నారు. అవిశ్వాస తీర్మానంలో మీ వాదనని గట్టిగా వినిపించాలని.. కేంద్రానికి ఇంత త్వరగా సరెండర్ అయిపోవల్సిన అవసరం లేదని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం మీకు తెలిసినా.. ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. రూ.4117 కోట్లు మాత్రమే రెవిన్యూ డెఫిషిట్‌గా కేంద్రం మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూ వచ్చిందని.. మొన్న మాత్రం పదివేల కోట్లు మంజూరు చేశారని అన్నారు. కేంద్రం చెప్పిన మాట వింటే.. ఇష్టారీతిన నిధులు విడుదల చేస్తారన్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి 35 వేల కోట్లు రెవిన్యూ డిఫిషిట్ రావాలని అడిగారని వెల్లడించారు.
Diabeties Control : వారంలో 3 సార్లు తాగితే చాలు .. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది..
సీఎం జగన్, చంద్రబాబు కూడా కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయ్యారనే భావన కనిపిస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బుందేల్ఖండ్‌కి ఏ ప్రాతిపతికన సహాయం చేశారో.. అదే ప్రాతిపదికన చేస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.24,350 కోట్లు అని తెలిపారు. టాక్స్ బెనిఫిట్ పెద్దఎత్తున రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. వీటి గురించి గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని నిలదీశారు. రాష్ట్ర విభజన దారుణమైన స్థితిలో జరిగిందని.. షోరూం తెలంగాణకు వస్తే, గోడౌన్ మాత్రమే ఆంధ్రకు వచ్చిందని అభివర్ణించారు. ఆదాయం అంతా తెలంగాణకే లభిస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానంలో అన్ని విషయాలు మాట్లాడాలని, ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు. 20-21లో నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నుండి 6 ప్రాజెక్టులు వచ్చాయని, వాటిని ఆదానికి అప్పజెప్పారని అన్నారు. ఎన్‌హెచ్‌పీసీ లాంటి అగ్రిమెంట్లను ప్రైవేటుకు అప్పచెప్పటం సరికాదన్నారు. ఫైర్ సర్వీసెస్ సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన నిబంధన తొలగించే ప్రయత్నం చేస్తుందని తెలిసిందని.. అది ఏమాత్రం సరికాదని హెచ్చరించారు.