వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ గురువారం సాయంత్రం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. ఢిల్లీలోని ఖర్గే ఇంటిలో కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడ ప్రతిపక్షాలను ఏకం చేయడానికి వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చలు జరగాలని తాను కోరుకుంటున్నానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారితో మాట్లాడాలని సూచించారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు అందరినీ వెంట తీసుకుని ముందుకు సాగుతామని శరద్ పవార్ అన్నారు.
Also Read:Ambedkar Statue: సాగర తీరంలో రాజ్యాంగ నిర్మాత.. నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
శరద్ పవార్ ముంబై నుండి మమ్మల్ని సందర్శించి మాకు మార్గనిర్దేశం చేసినందుకు తాను సంతోషిస్తున్నాను అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్షాలను ఐక్యంగా తాను, రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌లతో చర్చించినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతిపక్షాలను ఐక్యంగా ఉంచుతామని ఖర్గే అన్నారు. దేశంలో జరుగుతున్న సంఘటనలు.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడేందుకు… ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, యువత ఉపాధికి ద్రవ్యోల్బణం వంటి అంశాలపై తాము ఒక్కటిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
విపక్షాలను ఏకం చేసే ప్రక్రియ ప్రారంభమైందని ఖర్గే, పవార్ చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. మేమంతా ఐక్యంగా ఉన్నాం అని రాహుల్ వాఖ్యానించారు. వచ్చే ఏడాది బీజేపీని ఎదుర్కోవడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి వేదికపై జట్టుకట్టే చర్చల మధ్య బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ తేజస్వి యాదవ్ లు మొన్న ఖర్గే, రాహుల్ ని కలిసిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. నితీష్ కుమార్ గురువారం లెఫ్ట్ అనుభవజ్ఞులైన సీతారాం ఏచూరి మరియు డి రాజాతో సమావేశమైనందున, ఈ వారంలో ప్రతిపక్ష ఐక్యతను సుస్థిరం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
Also Read: Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..
రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉన్నందున నాయకులు ఐక్యత చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. త్వరలో ప్రతిపక్షాల అగ్రనేతల సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలతో సమావేశమైన తర్వాత బిహా సీఎం నితీష్ కుమార్ దేశ రాజధానిని విడిచిపెట్టారు.
आज सरकारी संस्थाओं का दुरुपयोग हो रहा है, युवाओं के पास रोजगार नहीं है, महंगाई लगातार बढ़ रही है और बोलने की आजादी छीनी जा रही है।
ऐसे में हमने लोकतंत्र की रक्षा करने के साथ ही देश को बचाने के लिए एक होकर आगे बढ़ने का निर्णय लिया है।
: कांग्रेस अध्यक्ष श्री @kharge pic.twitter.com/xZSgfyWwsU
— Congress (@INCIndia) April 13, 2023