Mayawati: పొత్తుపై మాయావతి ఆలోచన చేస్తున్నారా..? ప్రతిపక్ష ఐక్యతపై బీఎస్పీ కన్ను పడిందా?. బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీఎస్పీకి చోటు దక్కలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా అడుగులు వేయాలనుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం బీఎస్పీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా విపక్షాల ఐక్యతపై బీఎస్పీ కన్నేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్పీ అధినేత్రి మాయావతి 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి మాయావతి బీఎస్పీ నేతలకు టాస్క్ కూడా ఇచ్చారు. బీఎస్పీ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో, బీజేపీ కార్యకలాపాలు మారిన రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవటానికి నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Ntr : మరొక యాడ్ లో కనిపించబోతున్న ఎన్టీఆర్..!!
మరోవైపు మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఐక్యతలో బీఎస్పీ భాగం కాదని తెలిపారు. మమతా బెనర్జీ, కేసీఆర్, నితీష్ కుమార్ ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రచారం చేస్తున్నారని.. కానీ తనను ఏ నాయకుడూ సంప్రదించలేదని అన్నారు. అటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని మాయావతి ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా మాయావతి నేరుగా బీజేపీపై విరుచుకుపడుతుండగా.., గతంలో కాంగ్రెస్, బీజేపీలు మాయవతిని ఇరుకున పెట్టాయి. మరోవైపు మాయవతి కాంగ్రెస్‌పై నేరుగా విమర్శలు చేయలేదు. అయితే మాయావతి పొత్తుకు సిద్ధమవుతున్నారనడానికి ఇదొక ఉదాహరణ. ఆమె తమ పార్టీ నాయకులు మరియు ఎంపీలను కూడా 2024 ఎన్నికల్లో పొత్తుతోనే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం వల్ల రాజకీయంగా లాభం ఉండదని.. అయితే నష్టపోయే అవకాశం ఉందని బీఎస్పీ నేతలకు తెలుసు. అటువంటి పరిస్థితిలో, మాయావతి పొత్తుకు సంబంధించి తన రాజకీయ లాభనష్టాలను కూడా అంచనా వేస్తున్నారు.
Read Also: Mega Princess: మెగా ప్రిన్సెస్ ఫోటోలు లీక్.. మెగా ఫ్యామిలీ సంచలన నిర్ణయం?
బీఎస్పీ 2014లో పోటీ చేయగా ఖాతా తెరవలేదు. అటు 2022లో ఒక సీటుతో ఎన్నికల బరిలోకి దిగగా.. అది కూడా గెలువలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని బీఎస్పీ 10 లోక్‌సభ స్థానాలను గెలుచుకోగలిగింది. మరోవైపు యూపీలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విపక్షాల ఐక్యతకు ఇరుసుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందులో విజయం సాధిస్తే మాయావతి ఒంటరి కావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీఎస్పీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగలవచ్చని, అందుకే కూటమి, విపక్షాల ఐక్యతపై నిఘా పెట్టాలని మాయావతి మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.