కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంట్ ఉభయసభనలు కుదిపేసింది. రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభ రెండూ వాయిదా పడ్డాయి. లోక్‌సభ సాయంత్రం 4 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత విపక్షాల ఆందోళన చేయడంతో స్పీకర్ ఓం బిర్లా ఒక నిమిషం లోపు సభను వాయిదా వేశారు.
బిర్లా తన సీటును స్వీకరించిన క్షణంలో నల్ల బట్టలు ధరించి సభకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు ఆయన కుర్చీపై కాగితాలు విసిరారు. సభ్యుల తీరుపై స్పీకర్ ఓంబిర్ల అసహనం వ్యక్తం చేశారు. సభను గౌరవప్రదంగా నడపాలనుకుంటున్నాను అని స్పీకర్ పేర్కొంటూ.. సభా కార్యక్రమాలను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వంపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు, కొందరు ప్రతిపక్ష సభ్యులు నల్ల బట్టలు ధరించి లోక్‌సభకు వచ్చారు. ఇక, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.
Also Read: BJP Leader Murder: కలకలం రేపుతోన్న బీజేపీ నేత హత్య.. నాటు బాంబులతో దాడి, కత్తులతో నరికి..!
అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో, సభలో ఉమ్మడి వ్యూహంపై చర్చించడానికి సమావేశం జరిగింది. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, ఎస్పీ, జేడీయూ, బీఆర్‌ఎస్, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ, ఐయూఎంఎల్, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్, టీఎంసీ, ఆర్‌ఎస్‌పీ, ఆప్, జే అండ్ కే నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో వాయిదా నోటీసు కూడా ఇచ్చారు. రాజ్యసభలో, అదానీ సమస్య , రాజకీయ నేతలపై ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంపై వంటి అంశాలపై నోటీసు ఇచ్చారు