Opposition Meeting: జూన్ 23న పట్నాలో జరిగిన విపక్షాల సమావేశం విజయవంతమైంది. రెండో భేటీలో కీలక అంశాలపై నిర్ణయాలు జరగనున్నాయి. ఈ రెండో సమావేశం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా.. ఈ సమావేశ వేదిక మార్చే నిర్ణయం తీసుకున్నట్టు ఎన్సీపీ చీఫ్, సీనియర్ నేత శరద్ పవార్ వెల్లడించారు.
Read Also: Trivikram: బ్రో టీజర్ లో పూజా హెగ్డే.. ఆడేసుకుంటున్న నెటిజన్స్
విపక్షాల రెండో సమావేశం బెంగళూరులో వచ్చే నెల 13వ తేదీ, 14వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు శరద్ పవార్ తెలిపారు. బెంగుళూరులో విపక్షాల భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొందరు నేతలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవార్ వెల్లడించారు. వచ్చే నెల మధ్యలో వర్షాలు ఉధృతంగా కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షిమ్లాలో సమావేశ నిర్వహణ సరైన నిర్ణయం కాకపోవచ్చనే అభిప్రాయానికి ప్రతిపక్షాలు వచ్చాయి. వాతావరణ పరిస్థితులు కారణంగా అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భూపాతాలూ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్‌కు విపక్ష పార్టీల ప్రతినిధులు హాజరు కావడం ఇబ్బందే అని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొందరు విపక్ష నేతల ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్ ఫ్లైట్స్‌లలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారు ఈ సమావేశానికి హాజరు కావడం దుర్భరంగా మారుతుందని ఆ వర్గాలు తెలిపాయి. అందుకే వేదికను మార్చే నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Durga Temple: దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు. భక్తుల కోసం ఇన్నీ సౌకర్యాలా..!
కొందరు ప్రతిపక్ష నేతలు షిమ్లా కాదనుకుంటే.. జైపూర్‌లో నిర్వహించాలనీ ప్రతిపాదించినట్టు కోరారని తెలిసింది. ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ప్రతిక్షాల భేటీతో ఓటర్ల ముందు బల ప్రదర్శన చేసినట్టుగానూ ఉండేదని ఆ నేతలు అభిప్రాయపడ్డారని ఆ వర్గాలు వివరించాయి. కానీ చివరకు ఈ వేదికను బెంగళూరుకు తరలించారు.