పార్లమెంట్‌ను ముట్టడించేందుకు వేలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ రైతులు నోయిడాలో ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ 5000 మంది సైనికులను మోహరించారు. రైతుల పాదయాత్రతో నోయిడాలో చాలా చోట్ల జామ్ ఏర్పడింది. మహామాయ ఫ్లైఓవర్ కింద రైతులు ఏకం అయ్యేందుకు ప్లాన్ చేశారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా కొనసాగిస్తున్నారు. పలు మార్గాలను దారి మళ్లించారు.
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీతో పాటు బాలీవుడ్ 'దబాంగ్' సల్మాన్ ఖాన్‌కు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని బెదిరించన వ్యక్తిని పోలీసులు మంగళవారం నోయిడాలో అరెస్ట్ చేశారు. అతడి వయసు 20 ఏళ్లు మాత్రమే. అతని పేరు మహమ్మద్ తయ్యబ్ అలీ. వృత్తిరీత్యా కార్పెంటర్, నోయిడాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.
నోయిడాలో ఓ మహిళ బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఓ దుకాణం బయట ఉంచిన పూల కుండీని దొంగిలిస్తున్న మహిళను కొందరు అడ్డుకోగా.. ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ)లో విఫలం కావడంతో ఒక యువతి నకిలీ ఐఏఎస్ అవతారమెత్తింది. స్పూఫ్ కాల్స్ ద్వారా అధికారులను బెదిరించి లగ్జరీ అనుభవించాలని ఎత్తుగడ వేసింది. కానీ పాపం పండి కటకటాల పాలైంది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఆయన తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్‌పూర్ గ్రామం సమీపంలో పోలీస్ స్టేషన్ జీపులో ప్రభుత్వ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు
పెళ్లి ఒత్తిడితో తంటాలు పడ్డ ఓ యువతి తనను కిడ్నాప్ చేసినట్లు నటించి కుటుంబ సభ్యులను, పోలీసులను ఆశ్చర్యపరిచింది. యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేశానని, వెంటనే రక్షించాలని చెప్పింది. దీంతో భయపడిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీనియర్ పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొన్ని గంటల్లోనే బాలికను ఢిల్లీ నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి…
IAS Officer: మాజీ ఐఏఎస్ ఇంటి నుంచి రూ.42 కోట్ల 85 లక్షల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. బిఎస్‌పి ప్రభుత్వంలో తన ప్రాభవాన్ని నెలకొల్పిన మాజీ ఐఎఎస్ అధికారి మొహిందర్ సింగ్ కమలం ప్రాజెక్టు నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని ఈడీ రైడ్‌లో లభించిన పత్రాల ద్వారా కూడా స్పష్టమైంది . అందరూ దీని కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చండీగఢ్ లోని అతని ఇంట్లో లభించిన పత్రాలు.., మొహిందర్ సింగ్ తోపాటు చాలా మంది వ్యక్తులను…
నోయిడాకు చెందిన ప్రొఫెషనల్ సింగర్ సహజ్ అంబావత్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌కు మొదటి ఫోన్ యజమాని అయ్యాడు. ఆయన ఐఫోన్ 16 ప్రో 256జీబీ డెసర్ట్ టైటానియం వేరియంట్‌ను కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 1.3 లక్షలు. కానీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కారణంగా.. రూ. 1.25 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ సింగర్‌గా సహజ్.. ఐఫోన్ 16 ప్రో యొక్క ఆడియో మిక్స్ ఫీచర్‌ని ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఐఫోన్ 16 కొనడానికి ఉదయం…
నోయిడాలోని జేపీ ఆస్పత్రిలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మగ, మహిళా సెక్యూరిటీ గార్డులపై ఇష్టానురీతిగా దాడులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. ఇంకొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
Semicon India 2024: సెమికాన్ ఇండియా 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గ్రేటర్ నోయిడాకు రానున్నారు. ప్రధాని ఉదయం 10:20 గంటలకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌కు చేరుకుంటారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం, చిల్లా రెడ్…