ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా చోలాస్ గ్రామంలో ఇంటి పైకప్పు కూలింది. దీంతో.. శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. భారీ వర్షం కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది.
నోయిడాలో పోలీసులు కాల్పులు చేపట్టారు. అనంతరం నోయిడా పోలీసులు నలుగురు దుండగులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదుతోపాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. దుండగులపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
నోయిడాలో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 94లో ఉన్న పోస్ట్‌మార్టం హౌస్‌లో అశ్లీల వీడియో బయటపడింది. ఓ ఉద్యోగి ఒక మహిళతో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేగాక.. ఆ నీచ పనిని మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వీపర్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు.
ఆమె ఒక ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగి. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. అదే సహోద్యోగులకు రుచించలేదు. నిత్యం ఆమెకు నరకం చూపించారు. క్షణం.. క్షణం కుమిలిపోయింది. అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు.
నోయిడాలోని సెక్టార్-8 ప్రాంతంలో ఆదివారం ఒక ప్లాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 35 కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స్కోడా స్క్రాప్ చేసిన కార్లను ఖాళీ స్థలంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.., మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటల గురించి కాల్ వచ్చిందని., తాము వెంటనే ఫైర్ ఇంజెన్స్ తో అక్కడికి చేరుకుంట్లు తెలిపారు. Iceland: ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్‌డోత్తిర్’..…
తాజాగా నోయిడాకు చెందిన 41 ఏళ్ల వ్యాపారవేత్త 9 కోట్ల రూపాయల మేర సైబర్ వలలో మోసపోయారు. సైబర్ మోసంలో చిక్కుకున్న ఆయన ఏకంగా 9.09 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. నోయిడాలోని సెక్టర్ 40 కి చెందిన రజిత్ బోత్ర ఏప్రిల్ 28న ఓ లాభదాయమైన షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ చిట్కాలను అందించే వాట్సప్ గ్రూపులో చేరడం జరిగింది. అలా చేరిన నెల రోజుల లోపల ఈ రేంజ్ లో అతను మోసపోయాడు. Committee Kurrollu: ‘ఆ…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జనవరి 20న 50 ఏళ్ల ఈ-రిక్షా డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని బైక్‌కు కట్టేసి రోడ్డుపై తిరిగారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ట్యాక్సీ రైడర్ అవతారమెత్తి ఓ దొంగ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఓలా ట్యాక్సీ రైడర్‌గా ఉంటూ.. ప్రయాణికుల వద్ద నుంచి పలు వస్తువులను కొట్టేసేవాడు. తాజాగా.. ఓ మహిళ బ్యాగ్‌తో పారిపోయి పోలీసులకు చిక్కాడు. ఆ బ్యాగ్‌లో ఐఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని సొసైటీలో నివసిస్తున్న అధీరా సక్సేనా అనే మహిళ ఓలా బైక్‌ను బుక్ చేసింది. బైక్ పై ప్రయాణం చేసి…
ఢిల్లీలోని నోయిడాలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడా లోని సెక్టార్ 53 వీధుల్లో పాలు కొనడానికి బయటకు వెళ్లిన ఓ 64 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని తెల్లటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ‘జనక్ దేవ్’ అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో.. వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న తెల్లటి కారు అవతలి వైపు…
కొత్వాలి సెక్టార్-24 ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కంచన్‌జంగా మార్కెట్ సమీపంలో వేగంగా వస్తున్న ఆడి కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందాడు. కారు వేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టడంతో.. కాసేపు గాలిలో ఉండి పది మీటర్ల దూరంలో పడిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై మృతుడి కుమారుడు గుర్తు తెలియని డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.