Noida: ఐఏఎస్ అవతారమెత్తిన యువతి.. పూజాఖేద్కర్‌లా బిల్డప్.. చివరికిలా..!
- నకిలీ ఐఏఎస్ అవతారమెత్తిన యువతి
- పూజాఖేద్కర్‌లా బిల్డప్
- జోయా ఖాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ)లో విఫలం కావడంతో ఒక యువతి నకిలీ ఐఏఎస్ అవతారమెత్తింది. స్పూఫ్ కాల్స్ ద్వారా అధికారులను బెదిరించి లగ్జరీ అనుభవించాలని ఎత్తుగడ వేసింది. కానీ పాపం పండి కటకటాల పాలైంది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

Also Read
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
- High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
- Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
జోయా ఖాన్ అనే యువతి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అయింది. దీంతో ఆమె నకిలీ ఐఏఎస్ అవతారమెత్తి.. దర్జాగా తిరిగాలని ప్రణాళిక వేసింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన సర్వర్‌ను ఉపయోగించి స్పూఫ్ కాల్ ద్వారా పోలీసు అధికారులను బెదిరించి ఆయా పనులు చక్కబెట్టేస్తోంది. ఇలా నోయిడా, గురుగ్రామ్, మీరట్‌లో పోలీస్ ఎస్కార్ట్‌ను డిమాండ్ చేసింది. మగ గొంతుతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారిలా బిల్డప్ ఇచ్చి బెదిరింపులకు దిగింది. అచ్చం.. మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌లా గొంతెమ్మ కోర్కెలు కోరింది. జోయా ఖాన్.. పోలీసు అధికారులనే కాదు.. సామాన్య ప్రజలను కూడా ఇలానే బెదిరించినట్లు తేలింది.
కొన్ని రోజుల క్రితం నోయిడాలోని సెక్టార్ 142 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి జోయా ఖాన్ ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. సీనియర్ పోలీసు అధికారిగా నటించి తనకు అనుకూలంగా కేసును వాదించాలని ఆమె ఎస్‌హెచ్‌వోపై ఒత్తిడి తెచ్చింది. మరో సందర్భంలో అభిషేక్ జైన్ అనే వ్యక్తికి అవినీతి నిరోధక బ్యూరో నంబర్ నుంచి కాల్ చేసి బెదిరించింది. ఈ కేసులో వాదిస్తే తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిస్తానని జోయా ఖాన్ బెదిరించింది. మొత్తానికి పోలీస్ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా.. జోయా ఖాన్ భండారం బయటపడింది. దీంతో జోయా ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీస్ రిమాండ్‌లో జోయా ఖాన్‌ను విచారించగా ఆమె యవ్వారం బయటపడింది. స్పూఫ్ కాలింగ్ కోసం దుబాయ్‌లోని సర్వర్‌ను ఉపయోగించినట్లు తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శక్తి మోహన్ అవస్థి తెలిపారు. చాలా టెక్నిక్‌గా ఈ కాలింగ్ ఉపయోగించినట్లుగా వెల్లడించారు. అనేక సందర్భాల్లో మగ గొంతులో మాట్లాడేదని పేర్కొన్నారు. నోయిడా, గురుగ్రామ్, మీరట్‌ల్లో నకిలీ ఐఎఎస్, ఐపీఎస్‌గా నటిస్తూ పోలీసు ఎస్కార్ట్‌ను డిమాండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆమెపై మూడు చోట్ల కేసులు నమోదయ్యాయని తెలిపారు. జోయా ఖాన్ గతంలో యూపీఎస్సీ పరీక్షకు హాజరైందని.. ఎంపిక కాకపోవడంతో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారిలా నటిస్తూ ప్రజలను బెదిరించడం మొదలు పెట్టిందని తెలిపారు. సీనియర్ ప్రభుత్వ అధికారులుగా నటించేందుకు ఆమె అనేక వ్యూహాలను అనుసరించిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో ఓ ఐఏఎస్ అధికారి పేరు కూడా రావడంతో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. జోయా ఖాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసును ఛేదించేందుకు మరింత సమాచారం సేకరించేందుకు వీలుగా ఆమెను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క శెట్టి సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పేసినట్టేనా?
-
Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
-
Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!