ప్రేమ, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు… కారణమేదైనా కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. దేశంలో రోజు రోజుకూ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బలవన్మరణాలకు ఎక్కువగా ఆర్థిక సమస్యలు, ఒత్తిడి భరించలేకపోవడం కారణంగా ఉన్నాయి. తాజాగా నోయిడాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. నోయిడాలో ఒక మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆరో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. టెర్రస్ గోడపై కూర్చున్న ఆ మహిళ అకస్మాత్తుగా కిందకు దూకింది. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్ఫాబాద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని సమాచారం.
ఈ వీడియోను ఓ వినియోగదారుడు సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. “నోయిడాలో మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఒక మహిళ 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గత 4 రోజుల్లో, నోయిడా మరియు గ్రేటర్ నోయిడాలో దాదాపు 10 మంది మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారు. సమాజానికి దూరంగా ఉండటం, సోషల్ మీడియాలో బిజీగా ఉండటం మానసిక ఒత్తిడికి కారణమవుతోంది.” అని రాసుకొచ్చాడు.
नोएडा में मानसिक तनाव से गुजर रही महिला ने 7वीं मंजिल से कूदकर आत्महत्या कर ली,
पिछले 4 दिनों में नोएडा और ग्रेटर नोएडा में तकरीबन 10 लोगों ने सुसाइड कर लिया केवल मानसिक तनाव के चलते,
समाज से दूरी बनाए रखना और सोशल मीडिया ज्यादा व्यस्थ रहना मानसिक तनाव का कारण है, #Noida pic.twitter.com/NuqZIjhwOu
— Mahender Mahi (@MahendrMahii) January 24, 2025