Ritesh Agarwal: దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో హాస్పిటాలిటీ చైన్ ను రన్ చేస్తున్న కంపెనీ ఓయో. దానిని స్థాపించింది.. కేవలం 29 ఏళ్ళ యువకుడు రితేష్ అగర్వాల్. రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడకు చెందిన మర్వాడి కుటుంబంలో జన్మించాడు. ఆరోజుల్లో రితేష్ కుటుంబం ఇక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. మొదట్లో రితేష్ సిమ్ కార్డ్స్ అమ్ముకునే వాడు. మొత్తానికి ఓయో బిజినెస్ సక్సెస్ అవడంతో రితేష్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఫేమస్ అయ్యాడు. ఇక ఈ తాజాగా రితేష్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఒక బిజినెస్ విమెన్ తో అతడి వివాహం మార్చి 7 న అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఈ యువకుడి పెళ్ళికి దేశ ప్రధానితో సహా అటెండ్ కానున్నారు. ఈ మధ్యనే తనకు కాబోయే భార్య, తల్లితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వివాహ పత్రికను అందించడం జరిగింది. ప్రధాని సైతం పెళ్ళికి వస్తానని హామీ ఇచ్చారట.
ప్రధాని తరువాత రితేష్ వివాహానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆయనను కూడా కలిసి రితేష్ వివాహ పత్రిక అందజేశాడట. వీరితో పాటు ఓయో బిజినెస్ కి తమ సహకారం అందించిన ఎయిర్ బిఎన్బీ, లైట్ స్పీడ్ కామర్స్ వంటి సంస్థల అధినేతలు కూడా ఈ పెళ్లికి హాజరయ్యే ప్రముఖులు జాబితాలో ఉన్నారని సమాచారం. అంతేకాకుండా జపాన్ ఇన్వెస్టర్స్ లో ఒకరైన సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి కూడా రానున్నారట. ఇక దేశ, సి విదేశాల ప్రముఖులు సైతం వీరి పెళ్ళికి రానున్నారని టాక్. ఏదిఏమైనా ఒక సాధారణ సిం కార్డులు అమ్మే యువకుడు.. కష్టపడి ఒక స్థాయికి చేరుకొని తన పెళ్ళికి దేశ ప్రధానిని సైతం ఆహ్వానించే స్థాయికి వెళ్లడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.