Reliance Industries: ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలయన్స్ కంపెనీల బాధ్యతలను వారసులకు అప్పగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదే నాయకత్వ బదలాయింపు ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించగా.. తాజాగా నాయకత్వ బదలాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ జియో ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. అటు చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రిలయన్స్ గ్రూప్ ఇంధన వ్యాపార బాధ్యతలను అప్పగించారు.…
Mukesh Ambani statement on Jio 5G: హైస్పీడ్ 5జీ స్పెక్ట్రం సర్వీసులను ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి తేనున్నట్లు రిలయెన్స్ జియో సంస్థ ప్రకటించింది. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయెన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆన్‌లైన్‌లో జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన కంపెనీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్‌లో 80 మిలియన్ల డాలర్ల విలువ గల బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నగరంలోనే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు బెదిరింపులు జారీ చేసినందుకు ఒక వ్యక్తిని ముంబై పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Mukesh Ambani: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ముఖేష్ అంబానీ వరుసగా రెండో ఏడాదీ వేతనం తీసుకోలేదు. 2020లో కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ నేపథ్యంలో ఆయన
ముకేశ్ అంబానీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. అపర కుబేరుల్లో ముకేశ్ ఒకడు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా వెలుగొందుతున్న రిలయన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ఇక ముకేశ్ జీవిత చరిత్ర కూడా అందరికి తెరిచిన పుస్తకమే.. తండ్రి ధీరుభాయి అంబానీ కష్టపడి కట్టిన వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరుడు అనిల్ అంబానీతో కలిసి అంతకు పదింతలు చేశాడు. తండ్రి ఉన్నంతవరకు కలిసికట్టుగా ఉన్న ఈ అన్నదమ్ములు తండ్రి మరణం తరువాత వ్యాపార లావాదేవీలతో విడిపోయారు. ఒకరిపై…
అస్సాం రాష్ట్రం వరద విలయంలో చిక్కుకుంది. గత కొన్ని రోజలు నుంచి భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలోని మొత్తం 35 జిల్లాల్లో 30 జిల్లాలు వర్షాలు, వరదల తాకిడికి గురయ్యాయి. దాదాపుగా 46 లక్షల మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 118 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 10 మంది వరదల కారణంగా మరణించారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదలతో విలవిల్లాడుతున్న అస్సాంకు…