Netigens Trolling On John Abraham Dressing Style: సాధారణంగా నెటిజన్లు.. ఎవరైనా, ఏమైనా తప్పులు చేస్తే ట్రోల్ చేస్తారు. ఎక్కడో ఒక చోట చిన్న విషయాన్ని పట్టుకొని మరీ, విమర్శనాస్త్రాలు సంధిస్తారు. అయితే.. ఇక్కడ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఎలాంటి తప్పు చేయకపోయినా, అతడ్ని విమర్శిస్తున్నారు. నెట్టింట్లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అతడు ధరించిన దుస్తులే కారణం. సాధారణమైన జీన్స్ & బ్లాక్ బేజర్ ధరించినందుకు.. నీకసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదా? అంటూ ఏకిపారేస్తున్నారు.
Ricky Ponting: ఐపీఎల్‌లో పంత్ ఆడకున్నా పక్కనే కూర్చోబెట్టుకుంటా
ఆ వివరాల్లోకి వెళ్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే! గురువారం సాయంత్రం జరిగిన ఈ ఇంటికి బాలీవుడ్ నుంచి ఎందరో హేమాహేమీలు వచ్చారు. రాజకీయ ప్రముఖులు సైతం విచ్చేశారు. ప్రతిఒక్కరూ సాంప్రదాయ దుస్తుల్లోనే ఈ వేడుకకి హాజరయ్యారు. కానీ జాన్ అబ్రహం మాత్రం అందరికీ భిన్నంగా జీన్స్, టీ షర్ట్ & బ్లాక్ బేజర్ ధరించి, ఈ ఫంక్షన్‌కి వచ్చాడు. ఓవైపు పెద్దపెద్ద ప్రముఖులే సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో హుందాగా వస్తే.. జాన్ మాత్రం చాలా సింపుల్‌గా క్యాజువల్స్ వేసుకొని వచ్చేశాడు. ఇదే నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
Ex-Husband Crime: మరో వ్యక్తితో మహిళ రాసలీలలు.. తట్టుకోలేక భర్త కిరాతక పని
జాన్ ఇలా క్యాజువల్‌గా వెళ్లడాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం నీకు కనీసం డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదా? అంటూ విమర్శిస్తున్నారు. భారతీయ సాంప్రదాయ వేడుకలకు ఎలా రెడీ అవ్వాలో తెలియదా? ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోకుండా, ఇలా జీన్స్‌లో వస్తావా? అంటూ క్లాసులు పీకుతున్నారు. మరీ డ్రెస్సులు లేనట్టు.. అంత చీప్‌గా ఎలా వెళ్లావ్ అంటూ అతనిపై ఎగబడుతున్నారు. కాస్త మంచి దుస్తులు వేసుకోవాల్సిందని కామెంట్లు పెడుతున్నారు. అయితే.. జాన్ మాత్రం ఎప్పట్లాగే ఈ కామెంట్లను లైట్ తీసుకున్నాడు.
Mans Belly Dance : ఏందిరయ్యా ఈ అరాచకం.. ఏదేమైనా సూపర్