IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ కానుక?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్‌షిప్ కలిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల డిజిటల్ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సంస్థ 2.7 బిలియన్ డాలర్లు చెల్లించింది.
read more: Oil giant Saudi Aramco: కనీవినీ ఎరగని రీతిలో లాభాలను సొంతం చేసుకున్న సంస్థ
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తద్వారా ఈ పోటీలో వాల్ట్ డిస్నీ కంపెనీని మరియు సోనీ గ్రూప్ కార్పొరేషన్‌ను పక్కకు నెట్టేసింది. వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది పారామౌంట్ గ్లోబల్ మరియు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్. ఈ సంస్థ ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేయటం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలు వాటిని చూసేలా చేయనుంది. ఫలితంగా యాడ్స్ రూపంలో ఎక్కువ ఆదాయం పొందాలని భావిస్తోంది.
అయితే.. ఐపీఎల్ మ్యాచ్‌ల ఉచిత ప్రసారానికి సంబంధించి వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన డిస్నీ సంస్థ ఇదే అదునుగా డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను భారీగా పెంచుకుంది. కానీ.. వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం.
మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్‌లు దాదాపు 8 వారాల పాటు.. అంటే.. సుమారు 2 నెలల దాక కొనసాగుతాయి. ఈ మ్యాచ్‌లను ఈసారి 550 మిలియన్‌ల మంది చూస్తారని వయాకామ్18 మీడియా అంచనా వేస్తోంది. ఒక్కో మ్యాచ్ 3 గంటల సేపు జరుగుతుంది. ఎన్ని మ్యాచ్‌లైనా.. ఎన్ని సార్లయినా.. ఎంత సేపైనా.. ఏ ఇంటర్నెట్ డివైజ్‌లో అయినా ఫ్రీగా చూసే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇదిలాఉండగా.. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లను టీవీల్లో ప్రసారం చేసే హక్కులు మాత్రం డిస్నీకే సొంతమయ్యాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!