Campa Cola: పాత రుచి కొత్త బాటిల్ తో రానుంది ఐకానిక్ డ్రింక్ క్యాంపాకోలా ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ వేసవిలో ఇండియన్ మార్కెట్ లోకి రాబోతోంది. దాదాపుగా 50 ఏళ్ల క్రితం వరకు ఇండియాలో ఈ బ్రాండ్ చాలా ఫేమస్. 1970,80ల్లో ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఈ బ్రాండ్ ను వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారతదేశంలోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం క్యాంపాకోలా లెమన్, ఆరెంజ్ రుచులతో రాబోతోంది. అదానీ గ్రూప్, యూనిలివర్, ఐటీసీ నుంచి పోటీని ఎదుర్కొని క్యాంపాకోలాను రిలయన్స్ భారత్ లోకి మళ్లీ ప్రవేశపెడుతోంది.
Read Also: Pap Smear Test : 30 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి మూడేళ్లకోసారి చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్ష ఇది
ముందుగా వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తరువాత దేశం అంతటా అందుబాటులో ఉంచనున్నారు. క్యాంపా కోలాలో క్యాంపా లెమన్, క్యాంపా ఆరెంజ్ డ్రింక్స్ ను తీసుకురానున్నారు. క్యాంపాకోలా -‘‘ది గ్రేట్ ఇండియన్ టెస్ట్’’ ట్యాగ్ లైన్ తో వస్తోంది. 1970 దశకంలో క్యాంపా కోలా మార్కెట్ లీడర్ గా ఉండేది. అయితే 1990 ఆర్థిక వ్యవస్థ లిబరలైజేషన్ ప్రారంభం కావడంతో విదేశీ బ్రాండ్స్ కొకా కోలా, పెప్సీ వంటివి ఇండియాలోకి వచ్చి మార్కెట్ లీడర్లుగా ఎదిగాయి.
ఘనమైన 50 ఏళ్ల వారసత్వం కలిగిన క్యాంపా కోలాను భారతీయ బ్రాండ్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో, భారతీయ ప్రత్యేక రుచులతో భారత ప్రజలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉందని రిలయన్స్ తెలిపింది. ఈ వేసవిలో భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం 200 ఎంఎల్, 500 ఎంఎల్, 600 ఎంఎల్ లతో పాటు 1 లీటర్, 2 లీటర్ హోం ప్యాకుల్లో లభ్యం కానున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఇప్పటికే క్యాంపా కోలా యాడ్ రెడీ అయింది.